Tollywood Star Heroes: ఆ స్టార్ తప్పితే.. 100కోట్ల క్లబ్ లో బడా హీరోలు!

సినిమా ప్రపంచంలో హీరోల మార్కెట్ ప్రతి సినిమాకు కూడా మారుతూనే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే చాలా మంది హీరోలు ఈ ఐదేళ్ల కాలంలో నే వారి మార్కెట్ను ఒక్కసారిగా వందకోట్లు దాటించేశారు. ప్రస్తుతం అందరికి సినిమా సినిమాకు ఒక టార్గెట్ అయితే సెట్ అవుతోంది. ఇక ఈ క్రమంలో ఇండస్ట్రీలో టాప్ మిడియం స్మాల్ రేంజ్ లలో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే మూడు విభిన్నమైన కేటగిరీల లో హీరోల మార్కెట్ ను పోల్చుతున్నారు.

ముఖ్యంగా 100 కోట్ల క్లబ్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ కూడా ఇప్పుడు 100 కోట్ల షేర్ ను అందుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ మహేష్ బాబు టాప్ పొజిషన్ లో ఉన్న అందరు హీరోలు కూడా వంద కోట్ల క్లబ్లో అయితే చేరిపోయారు. అయితే ఇప్పటివరకు ఆ రికార్డును అందుకోలోనే ఏకైక టాప్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే.

ఒక విధంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలతో సమానంగా కొనసాగుతాడు అని చెప్పవచ్చు. మిగతా హీరోలు డైరెక్టర్స్ కాంబినేషన్స్ లో వారి మార్కెట్ ను పెంచుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం తన స్టార్ ఇమేజ్ తోనే ఒక్కసారిగా సినిమాకు హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయితే భీమ్లా నాయక్ సినిమాతో అయినా పవన్ కళ్యాణ్ 100 కోట్ల క్లబ్ లోకి చేరతాడు అనుకుంటే ఆ సినిమా వరల్డ్ వైడ్ గా 90 నుంచి 95 కోట్ల మధ్య లో షేర్ ను వసూలు చేసింది.

ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లోని టికెట్ల రేట్లు తక్కువగా ఉండడం కూడా ఆ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది అనే చెప్పాలి. తప్పకుండా భీమ్లా నాయక్ అయితే వంద కోట్ల షేర్ సాధిస్తుందని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. అగ్ర హీరోలందరు కూడా స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా 100 కోట్ల షేర్ ను ఈజీగా సాధిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ క్లబ్లో చేరాల్సి ఉంది. మరి రాబోయే సినిమాలతో ఆయన పవన్ కళ్యాణ్ రికార్డును అందుకుంటుందో లేదో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus