కొద్ది రోజుల హైడ్రామా తర్వాత ఎట్టకేలకు కటకటాల్లోకి ప్రముఖ నటి పనివాడు..!

పాపులర్ నటి పార్వతి నాయర్ గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఆమె ఇంటి పనివాడు సుభాష్ చంద్రబోస్ కటకటాల పాలయ్యాడు.. గతకొద్ది రోజులుగా పోలీసు విచారణకు సహకరించకుండా.. నటిపై వేధింపులకు పాల్పడుతున్న ఈ వ్యక్తిని నిన్న (డిసెంబర్ 7) న చైన్నై సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు.. సుభాష్, పార్వతి పరవుకు భంగం కలిగించేలా కామెంట్లు చేయడమే కాక, ఆమె ఫోన్‌ను దొంగిలించి అందులోని ఫోటోలను తప్పుడు పనులకు వాడాడన్న కారణంతో పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు..

వివరాల్లోకి వెళ్తే.. పార్వతికీ, ఆమె ఇంట్లో పని చేసిన సుభాష్‌కీ మధ్య గత కొన్ని నెలల నుండి వివాదం నడుస్తోంది. రెండు నెలల క్రితం తన ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయని పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభాష్‌ మీదే ఎక్కువ అనుమానం ఉందని ఆమె పోలీసులకు చెప్పింది. ఈ నేపథ్యంలో సుభాష్‌ పోలీసుల విచారణకు సహకరించలేదు సరికదా ఆమెపై బెదిరింపులకు దిగాడు.

అంతటితో ఆగకుండా పార్వతిపై మీడియా ముందు ఊహించని ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లోకి రాత్రి వేళల్లో ఎవరెవరో వచ్చి వెళ్తున్నారని.. అది చూసినందుకే తనపై కోపంగా ఉందని.. అందుకే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందని అన్నాడు.. ఒక డైరెక్టర్ పార్వతిని ఓ కంట కనిపెట్టమని తనకు చెప్పాడని చెప్పడంతో.. అతడి ఆరోపణలతో ఆగ్రహానికి గురైన పార్వతి నాయర్‌ కూడా మీడియా ముందుకు వచ్చింది. ‘‘కంప్లైంట్ ఇచ్చాక పోలీసులు నా స్టాఫ్ అందరినీ విచారించారు..

కానీ సుభాష్ విచారణకు సహకరించలేదు.. కంప్లైంట్‌ వెనక్కు తీసుకోకపోతే చచ్చిపోతానంటూ ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. అతను చెప్పిన ప్రతీ మాట, ప్రతి విషయం అబద్ధమం.. సుభాష్ తప్పు చేశాడు అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి.. అతని మనుషులు నాకు కాల్ చేసి వేధిస్తున్నారు.. ఈ సంఘటనలతో నేను మానసికంగా కృంగిపోయాను’’ అని చెప్పుకొచ్చింది.. పార్వతి నాయర్ మలయాళంతో పాటు కన్నడ, తమిళ్, హిందీలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus