The Raja Saab: రాజాసాబ్ బడ్జెట్ రివీల్ చేసిన మారుతి.. ఆ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారా?

ప్రభాస్ (Prabhas) మారుతి (Maruthi Dasari) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ (The Rajasaab)  మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దర్శకుడు మారుతి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లో ఈరోజుల్లో సినిమాను కేవలం 30 లక్షల రూపాయల బడ్జెట్ తో తీశానని చెప్పుకొచ్చారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు మాత్రం నాలుగు రోజులలో నాలుగు కోట్ల రూపాయలు ఖర్చైందని మారుతి అన్నారు.

ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్ లో రెండు మూడు సినిమాలు తెరకెక్కించేవాడినని మారుతి కామెంట్లు చేశారు. మారుతి కామెంట్లతో ప్రభాస్ సినిమాకు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని క్లారిటీ వచ్చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ రేంజ్ లో నిర్మిస్తుండటం గమనార్హం. మారుతి సినిమాకు ప్రభాస్ బల్క్ డేట్లు కేటాయించారని ఏప్రిల్ నెలలో ఈ సినిమాకు సంబంధించి మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ప్రభాస్ మారుతి కాంబో సినిమాకు సంబంధించి త్వరలో ఆసక్తికర అప్ డేట్స్ అయితే రానున్నాయి. ప్రభాస్ మారుతి కాంబో సినిమా 2025 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో మారుతి స్థాయి మరింత పెరగనుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది.

కల్కి (Kalki) , కన్నప్ప (Kannappa) , రాజాసాబ్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సలార్ తో (Salaar) సక్సెస్ సాధించిన ప్రభాస్ తర్వాత సినిమాలతో ఆ సినిమాను మించిన సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ సలార్2 సినిమా కూడా త్వరలోనే మొదలుకానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ వరుస సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus