2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో రూపొందుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(పండగకి వస్తున్నారు అనేది క్యాప్షన్) సినిమా రిలీజ్ అవుతుంది. 2025 లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాదిరి 2026 సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా ఇదే అని మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా ఫిక్స్ అయిపోయారు. నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమా రిలీజ్ అవుతున్నా.. అది అనిల్- చిరు సినిమా కలెక్షన్స్ కు అడ్డుగా ఏమీ ఉండదు అనేది అందరి కాన్ఫిడెన్స్.
అయితే అందరికీ షాక్ ఇస్తూ ‘ది రాజాసాబ్’ సినిమాని సంక్రాంతి బరిలో దింపుతున్నారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమా వస్తుంది అంటే చిరంజీవి- అనిల్ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం గట్టిగానే పడుతుంది. ఆ సినిమాకి మాత్రమే కాదు.. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ కూడా జనవరి 9కే రిలీజ్ కాబోతుంది. తెలుగులో విజయ్ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే ఏమీ రావు.
కానీ అది కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ రకంగా చూస్తే జనవరి 9న రిలీజ్ అయ్యే ఆ సినిమా ఇప్పటివరకు ప్రేక్షకులకు ఫస్ట్ ఆప్షన్ గా ఉండేది. కానీ ఇప్పుడు ‘ది రాజాసాబ్’ కూడా వస్తుంది అంటే మిగతా భాషల్లో ‘జన నాయగన్’ కలెక్షన్స్ పై కూడా ప్రభావం పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ఫస్ట్ ఆప్షన్ ‘ది రాజాసాబ్’ అవుతుంది. పొరపాటున ‘ది రాజాసాబ్’ టాక్ కనుక తేడా కొడితే వెంటనే ‘జన నాయగన్’ లీడ్ తీసుకుని డామినేట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఏం జరుగుతుందో చూడాలి.