ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మీకు తెలుసా?

మనకి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రాణాలు అర్పించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంతమంది గురించే మనకి తెలుసు. త్వరలో మరో వీరుడు గురించి తెలుసుకోబోతున్నాం. అతనే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి తన 151 వ సినిమా కోసం ఉయ్యాలవాడ జీవితాన్ని తీసుకున్నారు. చిరుకి నచ్చిన అతను ఎవరు? ఎక్కడి వారు? ఏమి చేశారు? అని తెలుసుకోవాలని ఆశ అందరిలో కలిగింది. వారికోసమే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సేకరించి అందిస్తున్నాం.

నరసింహారెడ్డి సొంత గ్రామం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. 18వ శతాబ్దంలో చాలా దక్షిణ భారత రాజ్యాల్లో పాలేగార్‌ వ్యవస్ధ ఉండేది. ప్రజలకు రక్షణ కల్పించడం, పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడటం, స్ధానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగివుండేవారు. ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను(డ్యామ్‌ల నిర్మాణం, వ్యవసాయంలో సాయం) కూడా చేపట్టేవారు.

1857 సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో ఎంతో కీలకపాత్ర ఉంది. సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుబాటు చేసిన పాలేగార్లకు గురించి చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఉయ్యాలవాడ గురించి పెద్దగా తెలియ లేదు.

సిపాయిల తిరుగుబాటుకు కొద్ది సంవత్సరాల క్రితమే తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల పరిపాలనపై తిరుగుబాటు చేసాడు. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులపై తిరుబాటు ప్రకటించిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ. సైన్యంతో ఓ బ్రిటీష్‌ స్ధావరంపై దాడి చేసిన నరసింహారెడ్డి బ్రిటీష్‌ సైనికులను అక్కడి నుంచి తరిమికొట్టాడు. దీంతో ఉయ్యాలవాడను అణచివేయాలని అప్పటి బెంగాల్‌ గవర్నర్‌ మార్క్‌ హేస్టింగ్స్ మద్రాస్‌ కలెక్టర్‌ సర్‌ థామస్‌ మన్రోకు ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఉయ్యాలవాడను పట్టుకుని ఆయన్ను బహిరంగంగా ఉరి తీయించారు.

ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర. మరి ఇలాగే తీస్తారో.. కమర్షియల్ హంగుల కోసం మార్పులు చేస్తారో ఇప్పుడే చెప్పలేము. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus