NTR30: ఆచార్య ఫలితం కాదు.. కొరటాల ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం అదేనట..!

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని తన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి 5 నెలలు పూర్తికావస్తున్నప్పటికీ ఇంకా ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు.ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

కానీ అభిమానులేమో ఆచార్య ఫలితం వల్ల నష్టాలు తీర్చే పనిలో ఉన్నాడు ఇప్పట్లో షూటింగ్ ప్రారంభం కాదు అని చెప్పుకుంటున్నారు. మరోపక్క కామన్ ఆడియన్స్ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా ఆగిపోలేదు, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ చిత్ర బృందం ఓ ఫోటోని షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. అయితే షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యేది చెప్పలేదు. దీంతో మళ్లీ చర్చల్లో నిలిచింది ఈ ప్రాజెక్ట్. అందుతున్న సమాచారం..

ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా లెవెల్లో స్టార్ట్ చేయడంతో కాస్టింగ్ సెలక్షన్ విషయంలో ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందట. కన్నడ నుండీ అక్కడి జనాలకు పరిచయం ఉన్న నటి రుషికా రాజ్ ను తీసుకున్నారు. అలాగే అక్కడి యంగ్ హీరోని తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఎక్కువగా పుష్ప లో జాలి రెడ్డి పాత్రని పోషించిన ధనుంజయ పేరుని పరిశీలిస్తున్నట్టు వినికిడి.

అంతేకాకుండా మలయాళం నుండీ అపర్ణ బాలమురళిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఆల్రెడీ ఆమెతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయి అని తెలుస్తుంది. ఇలా పక్క భాషల్లోని నటీనటులను ఎంపిక చేసుకోవడానికి టీమ్ తర్జన భర్జన పడుతున్నట్టు వినికిడి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus