Butta Bomma: ‘బుట్టబొమ్మ’ ప్లాప్ కు కారణాలు చెప్పుకొచ్చిన నిర్మాత

  • February 15, 2023 / 06:33 PM IST

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందే సినిమాల పై జనాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్ వంటిది ‘సితార..’. ఆయన కూడా ‘ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ అనే సంస్థ పై నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ భార్య పేరుతో ‘ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ రన్ అవుతుంది. సరే ఇంతకీ అసలు మేటర్ కు వచ్చేద్దాం. ఇటీవల ఈ బ్యానర్ నుండి ‘బుట్ట బొమ్మ’ అనే సినిమా వచ్చింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ చిత్రం ఇంత ఘోరంగా ఫ్లాప్ అవ్వడం పై తాజాగా నిర్మాత నాగ వంశీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “2020లో ‘కప్పెల'(‘బుట్టబొమ్మ’) రీమేక్ హక్కులు కొనుగోలు చేశాము. 2023లో విడుదల చేశాం. ఈ గ్యాప్ లో ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పులు వచ్చాయి.

అందువల్ల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకోలేదు. నేను, త్రివిక్రమ్ గారు కలిసి ఈ సినిమాను ముందుగానే చూశాము. ఇది థియేటర్స్ కి వెళ్లవలసిన సినిమా కాదని మాకు అప్పుడే అర్థమైంది. కానీ చివరి నిమిషంలో ఏమీ చేయలేని పరిస్థితి. ‘బుట్టబొమ్మ’ లో అర్జున్ దాస్ పాత్ర కోసం విశ్వక్ సేన్ ను అనుకున్నాము. కానీ క్లైమాక్స్ ను ఆడియన్స్ ముందుగా గెస్ చేసేస్తారని భావించి ఆ ఆలోచన మార్చుకున్నాము.

ఇక ఆటో డ్రైవర్ పాత్రకి సిద్దు జొన్నలగడ్డను తీసుకోవాలనుకున్నాము .. కానీ ‘డిజె టిల్లు’ తో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సూర్య మా బ్యానర్లో రూపొందిన గత సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేసిన సత్యం గారి అబ్బాయి. ఆయన చివరి కోరిక మేరకు సూర్యకు ‘బుట్టబొమ్మ’ లో ఛాన్స్ ఇచ్చాము. డబ్బు విషయాన్ని పక్కన పెడితే, మా అంచనాలను అందుకోకుండా నిరాశ పరిచిన సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus