Rajamouli: వామ్మో.. జక్కన్న సక్సెస్ కు రీజన్ ఇదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు జవాబుగా రాజమౌళి పేరు వినిపిస్తోంది. పలువురు టాలీవుడ్ హీరోలు స్టార్ హీరో స్టేటస్ ను అందుకోవడానికి పరోక్షంగా రాజమౌళి కారణమయ్యారు. అయితే డైరెక్టర్ గా టాప్ రేంజ్ లో ఉన్నప్పటికీ ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నప్పటికీ రాజమౌళి ఆ గర్వాన్ని ఏ మాత్రం ప్రదర్శించరు. తన డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోలు

తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించకూడదని రాజమౌళి షరతులు పెడతారనే సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు బాహుబలి సినిమాలో అవకాశం వదులుకోవడం గురించి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మొదట బాహుబలి సినిమాకు తాను డైలాగులు రాయాలని తన పేరును విజయేంద్ర ప్రసాద్ సూచించారని జొన్నవిత్తుల అన్నారు. నాన్నగారు చెప్పిన తర్వాత కాదననని రాజమౌళి అన్నారని తాను స్టోరీ డిస్కషన్ కోసం రెండున్నర నెలలు వెళ్లానని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పుకొచ్చారు.

రెండున్నర సంవత్సరాల సినిమా పూర్తయ్యే వరకు వాళ్లతోనే ఉండాలని రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో తనకు ఆ సినిమాకు పని చేయడం కష్టమైందని జొన్నవిత్తుల పేర్కొన్నారు. బాహుబలికి ఎక్కువ సమయం కేటాయిస్తే తాను సభలకు వెళ్లడం కుదరదని అందువల్ల ఆ సినిమాకు పని చేయలేనని చెప్పానని అయితే తను కొన్నిరోజులు సినిమాకోసం పని చేసినందుకు మంచి అమౌంట్ ఇచ్చారని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పుకొచ్చారు. రాజమౌళి సినిమా కోసం పని చేసేవాళ్లకు ఎలాంటి షరతులు విధిస్తారో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పకనే చెప్పేశారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus