Siddharth: లైవ్లోనే ఏడ్చేసాడు.. హీరో సిద్ధార్థ్ ఎమోషనల్ మూమెంట్.. వీడియో వైరల్!

సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రేమకథా చిత్రాల ప్రస్తావన వస్తే మొదట సిద్దార్థ్ పేరే గుర్తొస్తుంది. అది ప్రేక్షకులకైనా మేకర్స్ కి అయినా సరే. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాలతో సిద్దార్థ్ .. ప్రేమ కథా చిత్రాలకి తనే పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సిద్దార్థ్ ను స్టార్ ను చేసింది తెలుగు ప్రేక్షకులే..! అందుకు కారణం కూడా అదే..! కాకపోతే తెలుగు సినిమాలకి సిద్దార్థ్ దూరమవ్వడానికి కూడా ఇదే కారణమైంది.

ఎందుకంటే ప్రేమ కథలకు సిద్దార్థ్ పర్ఫెక్ట్ గా సూట్ అయినా… ఆ జోనర్ లో అతను చేసిన అన్ని సినిమాలు సక్సెస్ కాలేదు. పైగా తెలుగులో వేరే జోనర్ లో సినిమాలు చేయలేదు, చేయలేడు అనే రిమార్క్స్ కూడా వచ్చాయి. ఇక్కడి మేకర్స్ కూడా సిద్దార్థ్ కు లవ్ స్టోరీలు తప్ప… వేరే కథలు చెప్పడానికి రావడం లేదు అని స్వయంగా సిద్దార్థ్ చెప్పడం జరిగింది. అందుకే తమిళంలో మంచి యాక్షన్ సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు సిద్దార్థ్.

మరో రెండు రోజుల్లో టక్కర్ సినిమాతో అతను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉండగా.. సిద్దార్థ్ ఓ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. విషయం ఏంటంటే.. సిద్దార్థ్ పాల్గొంటున్న ఓ ఇంటర్వ్యూకి తమిళ సినీపరిశ్రమకి చెందిన సుజాత రంగరాజన్ వచ్చారు. ఈ క్రమంలో అతను లేచి కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేశాడు. తర్వాత ఆమె దగ్గరకి తీసుకోవడం జరిగింది. సిద్దార్థ్ ఎందుకు ఇలా చేశాడు అంటే..

‘బాయ్స్’ సినిమాకి సిద్దార్థ్ కరెక్ట్ గా సరిపోతాడు, అతన్ని తీసుకోండి అని చెప్పి సుజాత రంగరాజన్ దర్శకుడు శంకర్ ను రిక్వెస్ట్ చేశారట. ఆ సినిమా వాళ్ళ సిద్దార్థ్ కెరీర్ టర్న్ అయ్యింది. అందుకే సిద్దార్థ్ సుజాత రంగరాజన్ ను చూడగానే ఎమోషనల్ అయిపోయినట్టు స్పష్టమవుతుంది. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది.

https://www.youtube.com/watch?v=sM7X4H50z-A

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus