ప్రస్తుతం ఓ సినిమాకి ఓటీటీ బిజినెస్ జరగడం అనేది అంత ఈజీగా కుదరట్లేదు. కోవిడ్ టైంలో థియేటర్లు మూత పడినప్పుడు.. ఓటీటీ సంస్థలు పండగ చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు వీటి హవా నడిచింది. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో ఏ సినిమాకి కూడా ఎక్కువ వ్యూయర్షిప్ రావడం లేదు. నెంబర్ 1, 2 అంటూ ట్రేండింగ్ చేసుకుంటున్నప్పటికీ.. వాటికి రీచ్ ఎక్కువగా ఉండటం లేదనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు అడిగినంత చెల్లించి.. డిజిటల్ రైట్స్ దక్కించుకోవడానికి ఓటీటీ సంస్థలు రెడీగా లేవు. కానీ బడ్జెట్లో ఎక్కువ శాతం రికవరీ చేసుకోవాలి అంటే.. నిర్మాతలకి ఓటీటీలు తప్ప ఇంకో ఆప్షన్ కనిపించడం లేదు. వీటి నుండే సాధ్యమైనంత ఎక్కువ మొత్తం రాబట్టుకోవాలి. లేదు అంటే వ్యూయర్షిప్ బేస్లో తీసుకోవాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే.. ‘పుష్ప’ (ది రైజ్) (Pushpa) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది.
ఆ టైంకి నిర్మాతలు అడిగినంత ఇచ్చి డిజిటల్ రైట్స్ ను విడుదలకి ముందే అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. విడుదలైన 4 వారాలకే ‘పుష్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది. దానికి మంచి వ్యూయర్ షిప్ కూడా వచ్చింది. అందువల్ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) డిజిటల్ రైట్స్ ను కూడా ప్రైమ్ సంస్థ దక్కించుకోవాలని చూసింది.
కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కంటే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎక్కువ ఆఫర్ చేయడం వల్ల.. చివరి నిమిషంలో ‘పుష్ప 2’ రైట్స్ సంస్థ దక్కించుకున్నట్టు స్పష్టమవుతుంది. ‘పుష్ప 2’ తో పాటు మైత్రిలో రూపొందుతున్న మరో రెండు, మూడు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలని కలుపుకుని ‘మైత్రి’ సంస్థ ‘పుష్ప 2’ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ వారికి అమ్మేసినట్టు సమాచారం.