Rashmika: ఆ హీరో తో సినిమాకు రష్మిక మందన్నా నో చెప్పడానికి కారణం అదేనా..!

నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి సినిమా ప్రేక్షకులకు పరియయం అవసరం లేని వ్యక్తి. ప్రస్తుతం టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్‍లోనూ మూవీస్ చేస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‍గా మారింది ఈ కన్నడ భామ. టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‍గా ఉంటూనే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోనూ చేస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప 2తో బిజీగా ఉంది. బాలీవుడ్‍లోనూ రెండు చిత్రాలు చేస్తోంది. మరిన్ని సినిమాలు కూడా లైన్‍లో ఉన్నాయి.

అయితే, యంగ్ హీరో నితిన్‍తో చేయాల్సిన సినిమా నుంచి రష్మిక (Rashmika) తాజాగా తప్పుకుంది. నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా‍కు గతంలో ఓకే చెప్పింది రష్మిక. ఈ మూవీ పూజా కార్యక్రమం కూడా ఈ ఏడాది మార్చిలో జరిగింది. అయితే, పుష్ప 2తో పాటు ఓ ద్విభాషా చిత్రం, రెండు బాలీవుడ్ సినిమాలకు రష్మిక సైన్ చేసింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా నితిన్ – వెంకీ సినిమాకు డేట్లు కేటాయించడం రష్మికకు సమస్యగా మారింది. డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైంది.

దీంతో నితిన్ – వెంకీ కుడుముల మూవీ నుంచి రష్మిక తప్పుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రొడక్షన్ టీమ్‍తో సంప్రదింపులు జరిపిన తర్వాత.. ఈ చిత్రాన్ని వదులుకోవాలని రష్మిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 – ది రూల్ చిత్రం షూటింగ్‍లో ప్రస్తుతం రష్మిక మందన్నా బిజీగా ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప – ది రైజ్ సినిమా 2021లో బ్లాక్ బాస్టర్ అయింది.

ఈ చిత్రంలో శ్రీవల్లిగా నటించిన రష్మిక.. నేషనల్ క్రష్‍గా మారింది. పాన్ ఇండియా హీరోయిన్ అయింది. ఇప్పుడు పుష్ప – ది రైజ్‍కు సీక్వెల్‍గా పుష్ప 2 – ది రూల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‍లో రష్మిక ప్రస్తుతం ఉంది. రెయిన్ బో అనే తమిళం – తెలుగు ద్విభాష చిత్రంలోనూ హీరోయిన్‍గా చేస్తోంది రష్మిక. బాలీవుడ్‍లో రణ్‍బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలోనూ రష్మిక నటిస్తోంది. మరో బాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. దీంతో డేట్స్ కుదరక నితిన్ సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus