Ravi Teja, Gopichand: రవితేజ- గోపీచంద్..ల ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా?

రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. అవే ‘డాన్ శీను’ ‘బలుపు’ ‘క్రాక్’. ఈ 3 కూడా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఇదే కాంబినేషన్లో 4 వ సినిమా కూడా వస్తుందనే అధికారిక ప్రకటన వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తామంటూ ముందుకు రావడం జరిగింది. అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనే ప్రచారం ఊపందుకుంది.

రవితేజ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టాల్సి రావడంతో ‘మైత్రి’ సంస్థ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టడం జరిగింది. ఇదే ప్రాజెక్టుని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో గోపీచంద్ మలినేని చేయబోతున్నట్టు, ఈ ప్రాజెక్టు ‘మైత్రి’ సంస్థ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే రవితేజ- గోపీచంద్ మలినేని ప్రాజెక్టుని ‘మైత్రి’ సంస్థ పక్కన పెట్టడానికి కారణం బడ్జెట్ సమస్యలు కారణం అనే టాక్ బయటకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎందుకంటే ఖర్చుకి ‘మైత్రి’ సంస్థ వెనకాడదు. అలాంటి సంస్థ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది అని చెప్పాలి. అయితే దీని వెనుక వేరే కారణం ఉంది. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ తో పాటు చేసిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వీటి ఓటీటీ పెర్ఫార్మన్స్ కూడా బాలేదు. అందుకే రవితేజ – గోపీచంద్..ల ప్రాజెక్టుకి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదట.

మరోపక్క రవితేజ (Ravi Teja) ఏకంగా రూ.30 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తుండటంతో కొంచెం భారంగా ఫీలయ్యి, మైత్రి వారు ఈ ప్రాజెక్టుని వద్దనుకున్నట్టు సమాచారం. రవితేజ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసేది కూడా తన నాన్ థియేట్రికల్ బిజినెస్ చూపించే..! మరి తన నెక్స్ట్ సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు అంటే నిర్మాత మాత్రం ఎందుకు ముందుకొచ్చి సినిమా చేస్తాడు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus