2005 వ సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ‘చంద్రముఖి’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. ముఖ్య పాత్రలో జ్యోతిక, కీలక పాత్రలో ప్రభు నటించారు. పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చంద్రముఖి పాత్రలో జ్యోతిక కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఓ రకంగా ‘చంద్రముఖి’ అనే సినిమా అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించినప్పటికీ ఆయన హీరోలుగా కనిపించడు.
సందర్భానుసారంగా ఆయన పాత్ర ఉంటుంది. అదంతా జనాలకి ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించింది. అయితే దానికి సీక్వెల్ అంటూ వచ్చిన ‘నాగవల్లి’… ‘ఆప్త రక్షక’ కి రీమేక్ అనిపించుకుంది కానీ ‘చంద్రముఖి’ కి సీక్వెల్ అనే ఫీలింగ్ ను ఇవ్వలేదు. అయితే ‘చంద్రముఖి’ కూడా ‘ఆప్త మిత్ర’ కి రీమేక్. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘చంద్రముఖి’ కి సీక్వెల్ అంటూ ‘చంద్రముఖి 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పి.వాసు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటించింది. ఈ మధ్యనే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. వాస్తవానికి ‘చంద్రముఖి 2 ‘ లో హీరోయిన్ గా మొదట సాయి పల్లవిని సంప్రదించాడట దర్శకుడు. ‘చంద్రముఖి’ క్యారెక్టర్ డాన్సర్ కాబట్టి.. సాయి పల్లవి కూడా మంచి డాన్సర్ కాబట్టి.. వాసు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది. కానీ సాయి పల్లవి ఈ ప్రాజెక్టుని వద్దు అనుకుంది. ఆమె రిజెక్ట్ చేయడానికి కారణం..
‘చంద్రముఖి’ పాత్రలో జ్యోతిక ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఆమెను బాగా ఇంప్రెస్ చేసిందట. ఆమె రేంజ్లో తాను నటించి మెప్పించలేను అనే ఉద్దేశంతో సాయి పల్లవి ‘చంద్రముఖి 2 ‘ వద్దు అనుకున్నట్టు సమాచారం. ఒకవేళ సాయి పల్లవి (Sai Pallavi) కనుక ‘చంద్రముఖి 2 ‘ కి యాక్సెప్ట్ చేస్తే ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడేదేమో. ఇప్పుడైతే ఈ ప్రాజెక్టు పై అంతగా బజ్ లేదు అని చెప్పాలి.