త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ నటి కెరీర్ లో హిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఫ్లాపులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 2019 సంవత్సరంలో విడుదలైన రాక్షసుడు సినిమా తరువాత అనుపమ హీరోయిన్ గా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం అనుపమ నిఖిల్ కు జోడీగా 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు.
1996 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన జన్మించిన అనుపమ దూరవిద్య ద్వారా డిగ్రీ చేశారు. అనుపమ ముద్దు పేరు పొన్ను కాగా మలయాళంలో పొన్ను అంటే బంగారం అని అర్థం. ఫోటోషూట్లను ఎక్కువగా ఇష్టపడే అనుపమ చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని కెమెరా భయాన్ని పోగొట్టుకున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి అనుపమ ఎంట్రీ ఇవ్వడానికి ఆమె స్నేహితురాలే కారణం. మలయాళ ప్రేమమ్ సినిమాకు అడిషిన్స్ జరుగుతున్నాయని తెలిసిన అనుపమ స్నేహితురాలు ప్రేమమ్ అడిషన్స్ కు ఫోటోలు పంపాలని అనుపమను కోరారు.
అనుపమ నివిన్ పౌలి పక్కన ఛాన్స్ అంత ఈజీ కాదని చెప్పగా స్నేహితురాలు బలవంతం చేసి ఆమెతో ఫోటోలను పంపించారు. కొన్ని రోజుల తర్వాత చిత్రబృందం నుంచి ఫోన్ రావడంతో అడిషన్స్ కు హాజరై అనుపమ ఎంపికయ్యారు. అనుపమ మాతృభాష మలయాళమే అయినా ఆమె తొలి సినిమా నుంచి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అయితే ఖ అనే పదాన్ని మాత్రం అనుపమ గ అని ఉచ్చరించేవారు. తెలుగు ప్రేమమ్ లో “లోపలికి రా శేఖర్” అని పిలవమంటే ఆమె శేఖర్ గా బదులుగా శేగర్ అని అనుపమ పిలిచేదని ఒక సందర్భంలో తెలుగు ప్రేమమ్ దర్శకుడు చందు మొండేటి తెలిపారు.
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!