టాలీవుడ్లో అప్ కమింగ్ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోలకి లేదంటే స్టార్ హీరోలకి అభిమానులం అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు నిజంగా అభిమానులు అయినా కాకపోయినా.. ఇలా చెప్పుకోవడం అనేది ఒక స్టాటజీ. ఎందుకంటే దీని వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి.ఒకటి ఆ హీరోలు వీళ్ళపై ఫోకస్ పెట్టొచ్చు. ఎప్పటికైనా ఛాన్స్ ఇవ్వచ్చు. రెండోది ఆ స్టార్ల అభిమానులు కచ్చితంగా వీళ్ళని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు.
ఆ రకంగా వార్తల్లో నిలుస్తారు. ఇలా మొన్నామధ్య చేసింది విశ్వక్ సేన్ (Vishwak Sen) , సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఈ ఇద్దరు హీరోలూ నందమూరి అభిమానులుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. బాలకృష్ణ (Nandamuri Balakrishna), ఎన్టీఆర్ (Jr NTR)..ల మధ్య కొంత గ్యాప్ ఉన్నా. వారి మ్యూచువల్ ఫ్యాన్స్ కి వీళ్ళు బాగా దగ్గరయ్యారు. ఎన్టీఆర్, బాలకృష్ణ..లతో వీరు కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందరూ చూసినవే. అయితే వీళ్ళు బాలయ్య, ఎన్టీఆర్..ల అభిమానులు కావడంతో నిర్మాత నాగవంశీకి (Suryadevara Naga Vamsi) కూడా బాగా దగ్గరయ్యారు. నాగవంశీ వీళ్ళతో వరుస సినిమాలు చేయడానికి ఇదొక కారణమని ఇండస్ట్రీలో అనుకునేవాళ్లు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నారు. అంతెందుకు ‘దేవర’ని (Devara) డిస్ట్రిబ్యూట్ చేసిన నాగవంశీ… వాటి ప్రమోషన్స్ కోసం కూడా సిద్దు, విశ్వక్..లని రంగంలోకి దించాడు.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే… నాగవంశీ భీభత్సమైన నందమూరి అభిమాని. బాలయ్యతో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) కూడా నిర్మించాడు. కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ ను అతను ఓ అభిమాని కూడా చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) సినిమాల రేంజ్లో ఈ సినిమాని అతను ప్రమోట్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.