సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చినా సినిమా పరిశ్రమని విషాదాలు విడిచి పెట్టడం లేదు.గతేడాది చివర్లో చూసుకుంటే .. భాను శ్రీ మెహ్రా సోదరుడు నందు,మలయాళ సీనియర్ నటి మీనా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంటీ(MT) వాసుదేవన్ నాయర్,దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెన‌గ‌ల్,మలయాళ రచయిత,కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి,మలయాళ నటుడు దిలీప్ శంకర్ , హిట్ 3 సినిమా సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ కుమారి కృష్ణ గుండెపోటుతో మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో నటి కన్నుమూశారు.

Aparna Malladi

వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ డైరెక్టర్ అపర్ణ మల్లాది (Aparna Malladi) ఈరోజు మృతి చెందారు. కొన్నాళ్లుగా ఈమె క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చికిత్స కొరకు అమెరికా కూడా వెళ్లారట. ఓ దశలో కోలుకున్నట్టు కనిపించినా తర్వాత పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతూనే కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆమె వయసు 54 ఏళ్లు కావడం గమనార్హం.’ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్’ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ సినిమా ఆడకపోవడంతో ‘పోష్ పోరీస్’ అనే వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసింది.

యూట్యూబ్లో రిలీజ్ అయిన ఈ సిరీస్.. అన్ని ఎపిసోడ్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బోల్డ్ గా ఉన్నప్పటికీ.. ఈ సిరీస్ యూత్ ని అమితంగా ఆకట్టుకుంది అని చెప్పాలి.అటు తర్వాత అపర్ణ ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే సినిమా తెరకెక్కించారు. ప్రిన్స్, భావన, అనీషా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు. అటు తర్వాత పలు సినిమాలకు కథలు అందిస్తూ రైటర్ గా కొన్నాళ్ళు బిజీగా గడిపింది ఈమె. కెరీర్ ఫామ్లో ఉన్న టైంలో అది కూడా చిన్న వయసులోనే అపర్ణ (Aparna Malladi)  మరణించడం విషాదకరం అని చెప్పాలి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags