Jawan: ఆ దేశంలో జవాన్ రిలీజ్ కాకపోవడానికి కారణం అదేనా..!

  • September 11, 2023 / 05:09 PM IST

కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అగ్రహీరోల రేసులో వెనకబడిపోయారు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాడు. రూ.1000కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి తన స్టామినా ఏంటో చూపించాడు. తన తదుపరి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఎంతో కష్టపడి తీసిన సినిమా జవాన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ తో తన అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో అలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు దర్శకుడు.

ఈ సినిమాకు (Jawan) కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ దర్శకత్వం వహించాడు. ఎట్టకేలకు జవాన్ థియేటర్లకు వచ్చి ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్నాడు. జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా మార్కెట్లో కొత్త రికార్డులను సృష్టించాడు. అంతా హ్యాపీగా ఉందనుకున్న షారుక్ ఖాన్ అభిమానులకు బాడ్ న్యూస్ ఎదురైంది. దేశవ్యాప్తంగా విడుదలైన షారుఖ్ ఖాన్ మూవీ జవాన్.. పక్క దేశమైన బాంగ్లాదేశ్‌లో విడుదల కాలేదు.

గతంలో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కూడా అదే రోజు బంగ్లాదేశ్‌లో విడుదల కాలేదు. తాజాగా వచ్చిన జవాన్ సినిమా కూడా బంగ్లాదేశ్‌లో రిలీజ్ కాకపోవడంతో ఈ న్యూస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జవాన్ సినిమా బంగ్లాదేశ్‌లో విడుదల కాకపోవడానికి గల కారణం వచ్చే ఏడాది బంగ్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ అంతర్ యుద్ధం జరుగుతోంది. దీంతో అక్కడ ప్రజలు పలుచోట్ల ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఆ దేశంలో రాజకీయ సుస్థిరత కరువైంది. కొన్నిచోట్ల కర్ఫ్యూ వాతావరణ నెలకొనడంతో అక్కడ జవాన్ విడుదలను బంగ్లాదేశ్ బోర్డు నిషేధించింది. దీంతో షారుక్ ఫ్యాన్స్ రోడ్లపైకి సినిమా వెంటనే విడుదల చేయాలంటూ నిరసన చేపట్టారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus