Bigg Boss 7 Telugu: కలర్ టాస్క్ లో ప్రియాంక ఓడిపోయింది.. ఇదిగో సాక్ష్యం..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం మాయాస్త్రం అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ కి రెండో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. మలుపులో ఉంది గెలుపు అంటూ కలర్స్ డయాస్ ని ఏర్పాటు చేసి సంచాలక్ కి ఒక స్పిన్నర్ ని ఇచ్చాడు. ఆ స్పిన్ మీటర్ ఏ కమాండ్ పై ఆగుతుందో ఆ కమాండ్ ని పోటీలో పాల్గొనే వాళ్లు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే సంచాలక్ సందీప్ రెండు తప్పులు చేశాడు. ఇప్పుడు ఈ రెండు తప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి రౌండ్ లో రణధీర టీమ్ నుంచీ ప్రియాంక మహాబలి టీమ్ నుంచీ గౌతమ్ ఇద్దరూ వచ్చారు.

మొదటి రౌండ్ లో ప్రియాంక అన్ని కమాండ్స్ బాగా చేస్తు వచ్చింది. సంచాలక్ సందీప్ స్పిన్ తిప్పుతూ ఏ చెయ్యి ఏ కలర్ మీదకి రావాలి. అలాగే ఏ కాలు ఏ కలర్ మీదకి రావాలి అనేది చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా ప్రియాంక రెండు కాళ్లు బ్లూ కలర్ పైన పెట్టింది. కింద ఫోటోలో అది మనం నోటీస్ చేయచ్చు. అయితే, అప్పుడు ఇచ్చిన కమాండ్ రైట్ లెగ్ బ్లూ కలర్ మాత్రమే. లెఫ్ట్ లెగ్ గార్డెన్ లో గౌతమ్ పెట్టాడు. కానీ, ప్రియాంక మాత్రం రెండు లెగ్స్ బ్లూ కలర్ పైనే పెట్టింది. ఇది క్లియర్ గా మనం పిక్చర్ లో నోటీస్ చేయచ్చు. అంటే అక్కడ్ ప్రియాంక ఓడిపోయినట్లు.

ఇంకో పాయింట్ ఏంటంటే., లెఫ్ట్ లెగ్ రెడ్ కలర్ అనే కమాండ్ ఇచ్చినపుడు గౌతమ్ ట్రై చేసి బ్యాలన్స్ అవుట్ అయ్యాడు. కానీ, ప్రియాంక ట్రై చేయలేదు. అలాగే ఉండి గెలిచింది. ఇదెక్కడి న్యాయం. సంచాలక్ సందీప్ నిద్రపోతున్నాడా అని బిగ్ బాస్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రియాంక కూడా లెఫ్ట్ లెగ్ రెడ్ పైకి తెచ్చినపుడే కదా గెలిచేది. అలా కాకుండా ప్రీవియస్ కమాండ్ లోనే ఉండిపోయి గౌతమ్ పడిపోగానే తను గెలిచినట్లుగా లేచి గోల గోల చేసింది. ఇది సందీప్ పట్టించుకోలేదు.

ఇంకో మిస్టేక్ ఏంటంటే., శోభాశెట్టి తెలివి చూడండి.. కమాండ్ ఏమొచ్చిందంటే లెఫ్ట్ లెగ్ రెడ్ పైన ఉండాలి. ఆల్రెడీ రెడ్ పైనే ఉంది కదా అలాగే ఉంచేసింది శోభాశెట్టి ఇది కూడా సందీప్ పట్టించుకోలేదు. అపోజిషన్ లో ఉన్న ప్రశాంత ముప్ప తిప్పలు పడి కమాండ్ ని ఫాలో అయ్యాడు. కింద ఫోటోలో అది క్లియర్ గా చూడచ్చు.

ఇక్కడ సంచాలక్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, స్పిన్ తిప్పిన తర్వాత వాళ్లు కరెక్ట్ గా పెడుతున్నారా లేదా అనేది మోనిటర్ చేసి మళ్లీ వచ్చి స్పిన్ తిప్పాలి. లేదా స్పిన్ తిప్పేందుకు ఎవరినైనా అసిస్టెంట్ ని బిగ్ బాస్ ని అడిగినా సరిపోయేది. లేదా స్పిన్నర్ ని బోర్ట్ దగ్గరకి తెచ్చుకుని స్పిన్ తిప్పినా కరెక్ట్ గా ఉండేది. అస్సలు సందీప్ స్పిన్ తిప్పిన తర్వాత తనకి సంబంధం లేదని ఇంకో స్పిన్ తిప్పడానికే ప్రయత్నించాడు కానీ, హౌస్ మేట్స్ సరిగ్గా కమాండ్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది చూడలేకపోయాడు. సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడు.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus