Kalki 2898 AD: ‘కల్కి’లో కృష్ణుడు అలానే ఉండాలని ముందే ఫిక్స్‌ అయ్యారట.. అందుకే ఇలా..

  • June 29, 2024 / 07:28 PM IST

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో ప్రధాన పాత్రధారులు కంటే అతిథి పాత్రధారులే ఎక్కువ. సినిమాలో ప్రతి అరగంటలకు ఒకరు అన్నట్లుగా ఏదో ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ వస్తూనే ఉంటుంది. కొన్ని పేలినా, కొన్ని తుస్సుమన్నాయి. అంటే ఆ పాత్ర వచ్చి వెళ్లినట్లు కూడా కొంతమంది ప్రేక్షకులకు తెలియలేదు. ఆ విషయం పక్కనపెడదాం.. ఇప్పుడు టాపిక్‌ కృష్ణుడి పాత్ర ఫేస్‌ ఎందుకు సినిమాలో సరిగ్గా చూపించలేదు. సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించిన ఓ తమిళ నటుడు అని తెలిసింది..

అయితే ఇప్పుడు ఆ పాత్ర ఫేస్‌ను ఎందుకు క్లియర్‌గా చూపించలేదు అనేది ఇప్పుడు చూఛాయగా తెలుస్తోంది. అంతేకాదు మరికొన్ని పుకార్లు కూడా ఈ విషయంలో కొత్తగా పుట్టుకొచ్చాయి. వాటి బట్టి చూస్తే సరైన నటుడు లేకనే సినిమాలో కృష్ణుడి ముఖం చూపించలేదు అని అర్థమవుతోంది. ‘‘సినిమాలొ కృష్ణుడి పాత్రకు ముందుగా ఎవరినీ అనుకోలేదు. అందుకే సినిమాలోనూ ఆ పాత్ర ముఖాన్ని రివీల్‌ చేయలేదు’’ అని నిర్మాత అశ్వనీదత్‌ (C. Aswani Dutt) క్లియర్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు.

దీంతో ఈ విషయంలో పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది అని అనుకున్నారంతా. అయితే అన్ని అతిథి పాత్రలకు (ఒక పాత్రకు తప్ప) సరైన నటుణ్ని ఎంచుకున్న టీమ్‌కు కృష్ణుడి పాత్ర కోసం ఇంకో నటుడి దొరకడా అనే డౌట్‌ వస్తుంది. అంతేకాదు డౌట్‌ వచ్చింద కూడా. ఈ నేపథ్యంలో మనకు సినిమాల్లో కృష్ణుడు అంటే నందమూరి తారక రామారావే (Sr NTR) అనే మాట గుర్తుకొస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు సినిమా జనాలు అలానే అనుకుంటున్నారు.

భవిష్యత్తులో అనుకుంటారు కూడా. ఆయన కృష్ణుడి పాత్రలో అంతలా జీవించేశారు మరి. దీంతో ఆయనను మరపించే నటుడిని వెతకడం వృథా ప్రయాస అనుకునే సినిమా టీమ్‌ ఆ పాత్ర ఫేస్‌ను చూపించలేదు అని అంటున్నారు. మరి అందుకేనా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, వారసులు ఉన్నారుగా అనౌ డౌట్‌ కూడా రావొచ్చు. చూద్దాం టీమ్‌ ఏమైనా ఈ విషయంలో క్లారిటీ ఇస్తుందేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus