‘జైలర్’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నవాళ్ల సంఖ్యను అమాంతం పెంచిన విషయం అంటే… ‘కావాలయ్యా’ పాట అనే చెప్పాలి. తమన్నా హాట్ లుక్స్, స్టెప్పులతో ఆ పాట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరిని చూసినా ఆ పాట హుక్ స్టెప్ చేస్తూనే, చూస్తూనే కనిపించారు. అంతలా వైరల్ అయ్యింది ఆ పాట. అయితే ఇలాంటి ఫీట్‌కి కారణమైన తమన్నాకు సరైన న్యాయం జరగలేదు అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘జైలర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల లాంచ్ చేసింది. అందులో తలైవా లుక్, స్వాగ్, స్టైల్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అంతలా రజనీని మార్చేశారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకి, ఆయన ఫ్యాన్స్‌కు బాగా అవసరమైన మాస్ హిట్ ఈ సినిమాతో వస్తుందని నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఓ రెండు విషయాలు సినిమా టీమ్‌ను హాంట్ చేస్తున్నాయి.
అందులో ఒకటి తమన్నా అయితే… రెండోది సినిమాలో అతిథి పాత్రల్లో నటించిన ఇద్దరు అగ్ర నటులు. తొలుత తమన్నా సంగతి చూద్దాం. ఈ సినిమాలో తమన్నా కథానాయిక అనే విషయం తెలిసిందే. ఈ మేరకు రజనీతో డ్యాన్స్ కూడా వేసింది. ఆ స్టెప్పులు చూశాం కూడా. అయితే ఆమెను ట్రైలర్లో ఎందుకు చూపించలేదు అనేదే ఇప్పుడు ప్రశ్న. కనీసం ఒక్క ఫ్రేమ్‌లో కూడా తమన్నాను ఎందుకు చూపించలేదు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక రెండో విషయంలో సినిమాలో అతిథి పాత్రల్లో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్. అవును మీరు ట్రైలర్‌ను గమనిస్తే అందులో ఈ ఇద్దరిని కూడా చూపించలేదు. దీంతో ఎందుకిలా.. ఇది అగౌరవపరచడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే వాళ్లను చూపించకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. వాళ్ల పాత్రలను ఏమాత్రమూ రివీల్ చేయకూడదనే ట్రైలర్లో పెట్టలేదు అంటున్నారు. ఆగస్టు 10న సినిమా (Jailer) వస్తే గానీ అసలు విషయం తెలియదు.