త్రివిక్రమ్ ఎంపికపై నిర్మాత క్లారిటీ!

  • March 24, 2021 / 03:55 PM IST

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్-రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ ని కావాలనే ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారని.. సాగర్ చంద్రని పేరుకే దర్శకుడిగా తీసుకున్నారనే మాటలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై నిర్మాత సూర్య దేవర నాగవంశీ స్పందించారు.

సాగర్ చంద్ర మొదటిసారి భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ ని హ్యాండిల్ చేస్తున్నారని.. ఈ విషయంలో త్రివిక్రమ్ సహాయం చేస్తే మరింత కలిసొస్తుందని భావించి అతడిని ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. పైగా త్రివిక్రమ్ కి మల్టీస్టారర్ స్క్రిప్ట్ లను హ్యాండిల్ చేసిన అనుభవం ఉందని.. పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా రాయగలరని చెప్పారు. ఈ సినిమాలో డైలాగ్స్ భారీగా ఉంటాయని.. ఇద్దరు హీరోల మధ్య ఈగో క్లాష్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లు చెప్పారు.

త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మాత్రమే ఈ డైలాగ్స్ కి న్యాయం చేయగలరని నమ్మి ఆయన్ని ప్రాజెక్ట్ లో భాగం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇదివరకే హీరో రానా.. ఈ సినిమాను డైలాగ్-డ్రామాగా రూపొందిస్తున్నామని.. తెలుగు కల్చర్ ని వెండితెరపై ఎలివేట్ చేసే విధంగా సినిమా ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఈ సినిమా నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus