Acharya: ఆచార్య మార్పు వెనుక అసలు రీజన్ ఇదేనా!

  • April 18, 2022 / 05:33 PM IST

ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయవాడలో జరగనుందని ఈ ఈవెంట్ కు ఏపీ సీఎం జగన్ గెస్ట్ గా హాజరవుతారని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అటు సినీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఆచార్య ఈవెంట్ కు సీఎం జగన్ హాజరైతే జనసేన పార్టీకి నెగిటివ్ అవుతుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. రాజకీయంగా చిరంజీవి పవన్ దారులు సైతం వేరని ప్రచారం జరిగే ఛాన్స్ ఉందని కొంతమంది అభిప్రాయపడ్డారు.

Click Here To Watch NOW

అయితే ఈ నెగిటివిటీ చిరంజీవి దృష్టికి రావడంతో ఈ విషయంలో చిరంజీవి సైతం వెనక్కు తగ్గారని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే జరగనుంది. ఈ ఈవెంట్ కు హాజరయ్యే అతిథులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఆచార్య సినిమా నుంచి తాజాగా భలే భలే బంజారా సాంగ్ ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆచార్యతో చిరంజీవి, చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పూజా హెగ్డే, కాజల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా సినిమాలో చరణ్, కాజల్ కు సంబంధించిన సీన్లు కట్ అయ్యాయని సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కొరటాల శివ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఏప్రిల్ 29వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లను దాటుకుని విడుదల కానున్న ఆచార్య సక్సెస్ ఎంతోమంది కెరీర్ కు కీలకమని చెప్పవచ్చు. ఆచార్య ఈవెంట్ కు కాజల్ హాజరవుతారో లేదో చూడాల్సి ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus