Adipurush: ఆదిపురుష్ టీజర్ కు నెగిటివ్ టాక్ రావడానికి కారణాలివే?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రభాస్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. ఈ టీజర్ బాహుబలి టీజర్ రేంజ్ లో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ అందుకు భిన్నంగా ఉండటంతో ఫీలవుతున్నారు. భారీ అంచనాలే ఆదిపురుష్ కు శాపంగా మారాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ కు నెగిటివ్ టాక్ రావడానికి చాలా కారణాలున్నాయి.

బాహుబలి, బాహుబలి2 సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలేవీ అంచనాలు అందుకోలేదనే సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ కథ, కథనంలోని లోపాల వల్ల ఫ్లాప్ అయ్యాయి. ఆదిపురుష్ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించకుండా సాధారణంగా తెరకెక్కించి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ యానిమేషన్ మూవీ అని కొంతమందికి అభిప్రాయం కలగడమే ఈ టీజర్ పై నెగిటివ్ కామెంట్లకు కారణమని చెప్పవచ్చు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ కు టీజర్ వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగింది.

ఈ రీజన్ వల్లే మేకర్స్ సైతం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను ఆలస్యంగా రిలీజ్ చేశారని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆదిపురుష్ కు రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది. అయితే బ్రహ్మాస్త్ర టీజర్, ట్రైలర్ విషయంలో కూడా మొదట నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఆ తర్వాత పరిస్థితులు మారాయి. అదిపురుష్ విషయంలో కూడా అదే రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టీ సిరీస్ నిర్మాతలకు ఆదిపురుష్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ మొత్తం దక్కింది. అయితే ఆదిపురుష్ థియేట్రికల్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus