టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక దశలో నాగార్జున నటించిన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. అయితే ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలు ఏం చేసినా కలిసిరావడం లేదు. నాగార్జున ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలు ఎక్కువనే సంగతి తెలిసిందే. మన్మథుడు2, ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ సినిమాలు కలెక్షన్ల విషయంలో భారీ స్థాయిలో నిరాశపరిచాయి.
అక్కినేని హీరో నాగచైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో వరుస ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు. లాల్ సింగ్ చడ్డా తెలుగు కలెక్షన్లు కోటి రూపాయల కంటే తక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్ సినీ కెరీర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మినహా మరే హిట్ సినిమా లేదు. అక్కినేని హీరోలు క్లాస్ సినిమాలను ఎంచుకోవడం వల్ల నష్టం కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
క్లాస్ సినిమాలకు అక్కినేని హీరోలు దూరంగా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే సమయంలో టాలెంటెడ్ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అక్కినేని హీరోలు ఈ విషయాలలో మారని పక్షంలో ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. అక్కినేని హీరోలు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అయితే చిన్నచిన్న తప్పులు అక్కినేని హీరోల కెరీర్ కు మైనస్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అక్కినేని హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. అక్కినేని హీరోలు మనం తరహాలో మరో మల్టీస్టారర్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.