Alia Bhatt, Jr NTR: అలియా రిజెక్ట్ చేయడం వెనుక అసలు రీజన్ ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో జనతా గ్యారేజ్ తర్వాత మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఆగష్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మొదట ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి రెమ్యునరేషన్ కారణమని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏప్రిల్ నెలలో అలియా భట్ రణబీర్ కపూర్ పెళ్లి జరిగిందనే తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలని భావించి అలియా ఈ సినిమాకు నో చెప్పారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పెళ్లై మూడు నెలలు కాకముందే అలియా భట్ శుభవార్త చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొంతభాగం షూటింగ్ పూర్తి చేసిన సినిమాలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అలియా భట్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిన విషయంలో అలియా భట్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఎన్టీఆర్ అలియా భట్ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీత పాత్ర అలియాకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో అలియా భట్ పాపులారిటీతో పాటు రెమ్యునరేషన్ సైతం పెరిగింది. అలియా భట్ కొత్త ప్రాజెక్ట్ లతో తన రేంజ్ ను పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus