టాలీవుడ్ ఇండస్ట్రీలోని హిట్ కాంబినేషన్లలో ప్రభాస్ అనుష్క కాంబినేషన్ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ప్రభాస్ ను అనుష్క తండ్రి కలవడం జరిగింది. ప్రభాస్ ను అనుష్క తండ్రి కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రభాస్ అనుష్కలకు ఇప్పటికీ పెళ్లి కాకపోవడంతో వీళ్లిద్దరూ కలిసి ఏదైనా శుభవార్త చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, అనుష్క గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా వీళ్లిద్దరి గురించి వార్తలు ప్రచారంలోకి రావడం జరిగింది. ప్రభాస్, అనుష్క వేర్వేరు సందర్భాల్లో తామిద్దరం మంచి స్నేహితులమని అంతకు మించి ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పుకొచ్చారు.
ప్రభాస్, అనుష్కల (Prabhas) రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ సినిమాలన్నీ భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభాస్ కు మరిన్ని విజయాలు దక్కడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.
ఈ ఏడాది సలార్ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం.