Balakrishna: బాలయ్య మూవీ కొత్త టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాకు జై బాలయ్య, రెడ్డిగారు, అన్నగారు, పెద్దాయన టైటిల్స్ వినిపించాయి. చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా ఆ టైటిల్స్ ను కాదని వీరసింహారెడ్డి టైటిల్ ను ఫిక్స్ చేయడం వెనుక బాలయ్య కారణమని బోగట్టా.

బాలయ్య సినీ కెరీర్ లో సింహా అనే టైటిల్ తో ఎన్నో సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. ఆ కారణం వల్లే వీరసింహారెడ్డి టైటిల్ కు బాలయ్య ఓటేశారని బోగట్టా. జై బాలయ్య అనే టైటిల్ సినిమా కథకు సూట్ కాదని బాలయ్య భావించినట్టు తెలుస్తోంది. రెడ్డిగారు అనే టైటిల్ కూడా సాఫ్ట్ గా ఉందని భావించినట్టు బోగట్టా. అన్నగారు, పెద్దాయన టైటిల్స్ సాఫ్ట్ గా ఉన్నాయని ఆయన అనుకున్నారని సమాచారం అందుతోంది.

వీరసింహారెడ్డి టైటిల్ కథకు సూట్ అయ్యే టైటిల్ కావడంతో పాటు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి తరహాలో సక్సెస్ సాధించే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలోని సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా దర్శకుడు ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఈ సినిమాకు సంబంధించి మరో 20 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. డిసెంబర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నా బాలయ్య సంక్రాంతికే తన సినిమాను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపారు. మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా అఖండ సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus