Vijay: హీరో విజయ్ మాట తప్పడం వెనుక అసలు కారణాలివే?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా విజయ్ కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని రాజకీయాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే హీరో విజయ్ ఒక విషయానికి సంబంధించి మాట తప్పారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో విజయ్ సిగరెట్లు తాగే సీన్లలో, మందు సీన్లలో తాను నటించనని అభిమానులకు మాటిచ్చారు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ లియో సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమాకు విజయ్ పారితోషికం 150 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. విజయ్ లోకేశ్ కాంబినేషన్ లో గతంలో మాస్టర్ అనే సినిమా తెరకెక్కగా ఆ సినిమా కూడా సక్సెస్ సాధించిందనే సంగతి తెలిసిందే. వరుస విజయాలతో విజయ్ సత్తా చాటుతున్నారు. ఈ సినిమా డిజిటల్, ఆడియో హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ఈ నెల 22వ తేదీన విజయ్ పుట్టినరోజు కాగా ఆరోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. విజయ్ సిగరెట్ల్, మద్యం తాగడం వల్ల ఆయన ఫ్యాన్స్ చెడు త్రోవ పట్టే అవకాశం ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పీఎంకే పార్టీ అధినేత రామదాసు విజయ్ పై తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేశారు. విజయ్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

విజయ్ గత సినిమా వారసుడు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ సాధించింది. లోకేశ్ కనగరాజ్ విక్రమ్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా లియో కావడం గమనార్హం. ఇతర భాషల్లో సైతం విజయ్, లోకేశ్ కనగరాజ్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సినిమాకు ఆ సీన్లు కీలకం కావడం వల్లే విజయ్ ఆ సినిమాలో నటించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus