Srikanth: ఆ కారణం వల్లే శ్రీకాంత్ కు ఆఫర్లు తగ్గాయా?

  • July 1, 2022 / 12:38 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ ను సంపాదించుకోవడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం వరుస విజయాలను సొంతం చేసుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో కలిసి సినిమాలు చేసిన అతికొద్ది మంది హీరోలలో శ్రీకాంత్ ఒకరు కావడం గమనార్హం. హీరోగా బాగానే విజయాలను సొంతం చేసుకున్న శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. జగపతిబాబులా విలన్ పాత్రలకు పరిమితం కావాలని శ్రీకాంత్ భావిస్తున్నా జగపతి బాబుకు వచ్చిన స్థాయిలో శ్రీకాంత్ కు ఆఫర్లు రావడం లేదు.

అఖండ సినిమాలో విలన్ గా నటించినా శ్రీకాంత్ మెయిన్ విలన్ కాకపోవడం మైనస్ అయింది. శ్రీకాంత్ మెయిన్ విలన్ గా నటించి ఉంటే మాత్రం శ్రీకాంత్ కెరీర్ మరో విధంగా ఉండేది. అఖండ సినిమా విడుదలకు ముందు శ్రీకాంత్ ఈ సినిమాలో మెయిన్ విలన్ అని ప్రచారం జరిగింది. అఖండ సినిమా విడుదలైన తర్వాత అలాంటి పాత్రకు శ్రీకాంత్ ఎందుకు ఓకే చెప్పారో అర్థం కాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.

జేమ్స్ సినిమా శ్రీకాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టినా ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. శ్రీకాంత్ కెరీర్ విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు శ్రీకాంత్ విలన్ గా నటిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.

శ్రీకాంత్ కు ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ ను పెంచే సినిమాల్లో ఆయన నటించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారో లేదో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus