రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయిలో ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో ఏకంగా 1140 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీలలో ఆర్ఆర్ఆర్ అందుబాటులో ఉండగా ఓటీటీలలో సైతం ఈ సినిమా అందుబాటులో ఉండటంతో పాటు రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ కొనుగోలు చేయగా హిందీ వెర్షన్ హక్కులు మాత్రం జీ ఛానల్ దగ్గర ఉన్నాయి.
పది రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైందనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రేటింగ్స్ వెల్లడయ్యాయి. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ కేవలం 4.6 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ గతంలోనే స్టార్ మా ఛానల్ లో ప్రసారం కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు హిందీలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపలేదని సమాచారం అందుతోంది.
సరిగ్గా ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమాకు మరింత బెటర్ రేటింగ్స్ వచ్చేవని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుంది. మహేష్ సినిమాతో జక్కన్న ఏ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ సినిమా ఏకంగా 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు జక్కన్న రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!