2023 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న పెద్ద సినిమాలకు థియేటర్లను కేటాయించడం కష్టమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో సంక్రాంతి కానుకగా ఒక సినిమా థియేటర్లలో విడుదలవుతున్నట్టు ప్రకటన వెలువడింది. యూవీ సంస్థ నిర్మించిన కళ్యాణం కమనీయం సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడం వెనుక అసలు రీజన్ ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఒక పెద్ద నిర్మాత ఈ సినిమాను కావాలనే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
వారసుడు సినిమాను థియేటర్ల నుంచి తీసేసినా ఆ థియేటర్లు కళ్యాణం కమనీయం సినిమాకు కేటాయించే విధంగా అడుగులు పడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు నష్టం కలిగే విధంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో రిలీజయ్యే సినిమాల సంఖ్య అంతకంతకూ పెరగడం వల్ల థియేటర్ల విషయంలో అన్ని సినిమాలు నష్టపోయే అవకాశంతో పాటు కలెక్షన్లను అన్ని సినిమాలు పంచుకోవాల్సి ఉంటుంది.
పంతానికి పోవడం వల్లే పెద్ద సినిమాలకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు థియేటర్లకు కేటాయింపు విషయంలో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని బోగట్టా. చిరంజీవి, బాలకృష్ణ సైతం థియేటర్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గమనిస్తున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కు దూరంగా ఉండాలని స్టార్ హీరోలు భావిస్తున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఆ నిర్మాత నిర్మాణంలో సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి చూపడం లేదని బోగట్టా. ఇప్పుడు ఆ నిర్మాత వల్ల ఇబ్బందులు పడిన హీరోలు రాబోయే రోజుల్లో ఆ నిర్మాతకు షాకిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సంక్రాంతికి ఈ సినిమాలే కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!