Rajanikanth: సూపర్ స్టార్ బాధ వెనుక అసలు కారణాలు ఇవే!

  • July 25, 2022 / 01:49 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో క్రేజ్, పాపులారిటీని కలిగి ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు రజనీకాంత్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. అన్నీ ఉన్నా సంతోషమే లేకుండా పోయిందంటూ రజనీకాంత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ మాట్లాడుతూ నేను గొప్ప నటుడినని అందరూ అనుకుంటూ ఉంటారని కామెంట్లు చేశారు. అయితే ఆ విధంగా చెప్పడం ప్రశంసో, విమర్శో అర్థం కాదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

నాకు ఆత్మ సంతృప్తిని ఇచ్చిన సినిమాలు రాఘవేంద్ర, బాబా అని ఆయన వెల్లడించారు. బాబా మూవీని చూసిన తర్వాత చాలామంది హిమాలయాలకు వెళ్లామని చెప్పారని రజనీకాంత్ కామెంట్లు చేశారు. నా ఫ్యాన్స్ లో కొందరు ఆ మూవీ చూసిన తర్వాత సన్యాసులు అయిపోయారని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ అలా చేస్తుంటే నేను మాత్రం నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నానని రజనీకాంత్ కామెంట్లు చేశారు.

హిమాలయాలలో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయని ఆ మూలికలు తింటే వారం రోజులకు సరిపడా శక్తి లభిస్తుందని రజనీకాంత్ అన్నారు. ఆరోగ్యం అనేది మనిషికి చాలా ముఖ్యమని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. మనం అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సిన వాళ్లు సైతం తట్టుకోలేరని రజనీకాంత్ కామెంట్లు చేశారు. నేను నా లైఫ్ లో డబ్బు, పేరు ప్రఖ్యాతులను చూశానని రజనీకాంత్ వెల్లడించారు. అయితే సంతోషం, ప్రశాంతత మాత్రం నాకు దక్కలేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

సంతోషం, ప్రశాంతత శాశ్వతంగా ఉండేవి కాదని రజనీకాంత్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus