తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అంటే టాలీవుడ్ సెలబ్రిటీల సందడి అంతాఇంతా కాదు. అయితే 2024 ఎన్నికల సమయంలో మాత్రం ఈ సందడి కొంతమేర తక్కువగానే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బాలయ్య (Balakrishna) హిందూపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తుండగా జనసేన తరపున పిఠాపురం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , నగరి నుంచి వైసీపీ తరపున రోజా పోటీ చేయనున్నారు. అలీ (Ali) , హైపర్ ఆది (Hyper Aadi), పృథ్వీరాజ్(Prudhvi Raj) , మరి కొందరు సెలబ్రిటీలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.
అయితే పార్టీల తరపున కానీ సెలబ్రిటీల తరపున కానీ ప్రచారం చేయడానికి లేదా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టడానికి టాలీవుడ్ సెలబ్రిటీలు ఆసక్తి చూపడం లేదు. మద్దతు ఇవ్వాలని ఉన్నా కొంతమంది సెలబ్రిటీలు బహిరంగంగా వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. తాము మద్దతు ఇచ్చిన పార్టీ కాకుండా మరో పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ సినిమాలకు ఇబ్బంది కలుగుతుందని చాలామంది సెలబ్రిటీలు భావిస్తున్నారు.
నిఖిల్ (Nikhil) కొన్నిరోజుల క్రితం టీడీపీలో చేరినట్టు వార్తలు వచ్చినా ఆ వార్తలను పీఆర్ టీం ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రం గెలిచిన పార్టీకి కొందరు సెలబ్రిటీలు మద్దతు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ప్రభావం టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు సినిమాలకు వచ్చే కలెక్షన్లలో ఏపీకి మెజారిటీ వాటా ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఏపీలో భవిష్యత్తులో షూటింగ్ లు జరుపుకునే సినిమాల సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఉన్న స్టార్స్ ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీలకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.