Srikanth, Anitha: అనితా చౌదరి పెళ్ళి శ్రీకాంత్ వల్లే జరిగిందట.. అసలు మేటర్ ఏంటంటే..!

యాంకర్ అనితా చౌదరి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడంటే.. ఆమె సినిమాలు వంటి వాటిలో ఎక్కువ కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు మాత్రం సీరియల్స్ లో నటించేది. కస్తూరి, ఋతురాగాలు, నాన్న వంటి సీరియల్స్ లో ఈమె నటించి పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి. సుమారు 50 కి పైగా సినిమాల్లో ఈమె నటించింది. మురారి, సంతోషం,నువ్వే నువ్వే, ఛత్రపతి, ఉయ్యాలా జంపాలా, కేరింత వంటి సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ముఖ్యంగా ‘ఛత్రపతి’ సినిమాలో.. ‘సూరీడు’ అనే డైలాగ్ తో ఈమె బాగా ఫేమస్ అయ్యింది. ఇక అనిత చౌదరి పుట్టింది కోల్ కతా లో..! విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లో జరిగింది. ఈమెకు కూచిపూడి, డాన్స్‌ బ్యాలేలూ, కథక్ వంటి డ్యాన్స్ లు నేర్చుకుంది. ఇక ఆమె తక్కువ వయసులోనే కుటుంబ భారం మొత్తం మీద వేసుకోవడంతో పెళ్లి పట్టించుకోలేదు. అందువల్ల మొదట్లో ఈమెకు పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు.

ఈమె కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ఇష్టపడింది. కానీ ఆ విషయంలో ఈమె బయటపడలేదు. తర్వాత అతను ఓపెన్ అయినా ఈమె మాత్రం కొంచెం బెట్టు చేసింది. దీంతో శ్రీకాంత్ రంగంలోకి దిగాడట. శ్రీకాంత్ కు కృష్ణ చైతన్యకి సంబంధం ఏంటి? అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. కృష్ణ చైతన్య.. శ్రీకాంత్ కు దగ్గరి బంధువు.

అందువల్ల కృష్ణ చైతన్య… పెళ్లి కోసం అనితతో మాట్లాడి ఒప్పించింది అతనేనట. శ్రీకాంత్ కు కృష్ణ చైతన్య కజిన్ అవుతాడు కాబట్టి.. అనితా చౌదరి కూడా.. అతనికి దగ్గరి బంధువు అవుతుందన్న మాట. ఈ విషయాలు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus