Kalki 2898 AD: జూన్ 27న కల్కి రిలీజ్ కావడం వెనుక అసలు కథ ఇదేనా?

  • June 27, 2024 / 09:31 PM IST

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD)  మొదట మే నెల 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఏపీ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడి ఈ నెల 27వ తేదీన విడుదలైంది. అయితే కల్కి మూవీ రిలీజ్ డేట్ విషయంలో న్యూమరాలజీ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారని తెలుస్తోంది. కల్కి టైటిల్ లో అన్ని నంబర్లను కలిపితే 27 అనే నంబర్ వస్తుందనే సంగతి తెలిసిందే.

జూన్ 27న కల్కి రిలీజ్ కావడం వెనుక అసలు కథ ఇదేనని సమాచారం అందుతోంది. ఈ న్యూమరాలజీ సెంటిమెంట్ వార్తలకు సంబంధించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కల్కి టీమ్ కు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం పాజిటివ్ రివ్యూలు ఇస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమా అద్భుతంగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయని చిరంజీవి పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ ప్రతిభను ప్రశంసిస్తూ చిరంజీవి పశంసల వర్షం కురిపించారు. నిర్మాత అశ్వనీదత్ కు (C. A swani Dutt) చిరంజీవి (Chiranjeevi) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. చిరంజీవి చేసిన ట్వీట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం. కల్కి సినిమా ప్రత్యేకతలకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ కలెక్షన్ల పరంగా మరికొన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని వ్యక్తమవుతున్నాయి. కల్కి సక్సెస్ తో ప్రభాస్ తర్వాత సినిమాలపై సైతం అంచనాలు అమాంతం పెరిగాయి. కల్కి 2898 ఏడీ సినిమా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కళకళలాడుతున్నాయి. కల్కి 2898 ఇతర భాషల్లో సైతం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus