టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి బాహుబలి, బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్, పాపులారిటీని సంపాదించుకున్న జక్కన్న మహేష్ సినిమాకు పాన్ వరల్డ్ లెవెల్ లో తెరకెక్కించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉండనుందని అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ టీంకు అరుదైన ఘనత దక్కిందనే సంగతి తెలిసిందే. ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ కమిటీలో కొత్తగా 398 మందికి సభ్యత్వం లభించిందని సమాచారం అందుతోంది.
ఈ 398 మందిలో ఆర్.ఆర్.ఆర్ టీంకు సంబంధించిన ఆరుగురికి చోటు లభించింది. ఈ జాబితాలో చోటు సొంతం చేసుకున్న వాళ్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సిరిల్ ఉన్నారు. అయితే జక్కన్నకు చోటు దక్కితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో చాలా సినిమాలు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని జక్కన్న కమిటీలో ఉండి ఆయన సినిమాలకే అవార్డులు వస్తే కొంతమేర విమర్శలు వచ్చే ఛాన్స్ ఉందని
అందువల్ల రాజమౌళి (RRR) సభ్యత్వానికి దూరంగా ఉన్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరగాలని 2026 లోపు ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యం కావడం మహేష్ రాజమౌళి కాంబో మూవీపై ప్రభావం చూపుతుందేమో తెలియాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!