Vijay Sethupathi: విజయ్ సేతుపతి సినిమా ఛాన్స్ కోసం ఎన్ని కష్టాలు అనుభవించాడో తెలిస్తే కన్నీళ్లు అగవు!

  • July 1, 2023 / 07:46 AM IST

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నవిజయ్ సేతుపతి ఏ పాత్రను అయినా అలవోకగా జీవించేస్తారు. ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీల్లో‌ను నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. విక్రమ్ వేద, సూపర్ డీలక్స్, మాస్టర్, 96 వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. తెలుగులో ఉప్పెన సినిమాలో తన నట విశ్వ రూపాన్ని చూపించారు. నిజానికి స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు.. ఇత‌ర పాత్ర‌లు చేసేందుకు ససేమీరా అంటారు. కానీ విజ‌య్ మాత్రం అందుకు భిన్నం.

ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్ గా నటనలో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం తాను అనుభ‌విస్తున్న స్టార్ స్టేటస్ తనకు అంత ఈజీగా ఏమీ రాలేదు. ఆఫ‌ర్ల కోసం ఫోటోలు చేతులో ప‌ట్టుకుని చెప్పులరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగాడు. మొదట్లో ఎన్నో ఘోర అవ‌మానాల‌ను ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ కెరీర్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించాడు. అప్పట్లో విజయ్ ఓ థియేటర్ లో అకౌంటెంట్ గా వ‌ర్క్ చేసేవాడు.. అలా చేస్తూనే సినిమా అవకాశల కోసం ప్రయత్నించేవాడట.

ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీస్ లు చుట్టూ రోజూ (Vijay Sethupathi) తిరిగేవాడట. అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడట.. తనను చూడగానే కొందరు ముఖం మీదనే ‘నీ ముఖానికి సినిమాలు కూడానా’ అంటూ దారుణంగా మాట్లాడేవారట. కొంతమంది తన ఫోటోలు కూడా చూడటానికే ఇష్టపడేవారే కాదని తెలిపారు.

ఇంకొంత మంది అవ‌కాశం ఇచ్చి తీరా సెట్స్ వెళ్లాక ఆ నువ్వు లేవని చెప్పి పాత్ర మ‌రొక‌రితో చేయించేవాడు. ఈ సంద‌ర్బాల్లో ఎంతో బాధ క‌లిగేదని.. అయినా ఎప్పుడూ ఆత్మవిశ్వసం కోల్పోకుండా ప్రయత్నించి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus