సూర్య నారాయణ రాజు గారి కొడుకుగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని మొదట ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు. కానీ కృష్ణంరాజు గారికి కొడుకులు లేక ప్రభాస్ ని దత్తత తీసుకుని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ప్రభాస్ హీరోగా చేసిన మొదటి సినిమా ‘ఈశ్వర్’. ఈ మూవీ సో సోగా ఆడింది. అటు తర్వాత ‘రాఘవేంద్ర’ చేశాడు. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ‘వర్షం’ ఇతనికి మొదటి బ్లాక్ బస్టర్ మూవీ. ఆ తర్వాత ‘ఛత్రపతి’ ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘మిర్చి’ ‘బాహుబలి'(సిరీస్) వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగాడు.
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ కు సొంత అన్నయ్య ఉన్నాడు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కృష్ణంరాజు గారు పోయినప్పుడు ఆయన అంత్యక్రియలు ప్రభాస్ కు అన్నయ్య అయిన ప్రబోద్ చేతుల మీదుగా జరిగాయి. ప్రబోద్ కూడా పొడుగ్గా ఉన్నాడు. మంచి రంగు ఉన్నాడు. ‘అలాంటి ఇతను సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాడు.?
అసలు ఇతను ఏం చేస్తూ ఉంటాడు.?’ అనే డౌట్ చాలా మందిలో ఉంది. నిజానికి ప్రబోద్ కు చిన్నప్పటి నుండి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. అతనికి బిజినెస్ లో రాణించాలని బలంగా ఉంది. భీమవరం, మొగల్తూరులో ఉండే వాళ్ళ కొబ్బరి తోటలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులను… అతనే చూసుకుంటూ ఉంటాడు. ప్రబోద్ కూడా అందగాడే కాబట్టి కృష్ణంరాజు గారు ఇతన్ని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వమని అడిగారట.
కానీ ఇతనికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడంతో.. సూర్య నారాయణ రాజు గారు కానీ, కృష్ణంరాజు గారు కానీ అతని పై ఒత్తిడి చేయలేదు. పోనీ నిర్మాణ భాగస్వామ్యంలో అయినా కొనసాగమని కోరారట కృష్ణంరాజు. ‘గోపీకృష్ణా మూవీస్’ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లలో నిర్మాణ భాగస్వామిగా కొనసాగే అవకాశం ఉన్నా కూడా ఇతను వద్దనుకున్నాడట. అందుకే మీడియాకి కూడా ఇతను చాలా దూరంగా ఉంటాడు.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?