Kurchi Madathapetti: కుర్చీ మడతపెట్టి సాంగ్ .. పూర్ణ వల్లే ఆ లిరిక్స్ అలా ఉన్నాయట..!

  • December 31, 2023 / 12:34 PM IST

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత 3వ సినిమాగా ‘గుంటూరు కారం’ వస్తుంది. ఈ సినిమా పై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

ఆల్రెడీ ఈ చిత్రం నుండి ‘దమ్ మసాలా’ ‘ఓ మై బేబీ’ వంటి పాటలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ‘కుర్చీ మడతపెట్టి’ అనే మాస్ సాంగ్ ని మూడో పాటగా రిలీజ్ చేశారు. ‘రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తెలియనోళ్లు లేరు మేస్తిరి’ అంటూ ఈ పాట మొదలైంది. లిరికల్ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలని చూపించారు. ఆ విజువల్స్ చూసి హీరోయిన్ పై దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో అలాంటి లిరిక్స్ ఏంటి అంటూ కొంతమంది మండిపడ్డారు.

అయితే దీని వెనుక మేకర్స్ ఉద్దేశం వేరు. ఈ పాట ముందు ఐటెం సాంగ్ గా ప్రారంభం అవుతుంది అని సమాచారం. పైన చెప్పుకున్న లిరిక్స్ మొదట ఈ పాటలో ఐటెం గర్ల్ గా కనిపించనున్న పూర్ణ పై వస్తాయట. తర్వాత హీరోయిన్ శ్రీలీల .. మహేష్..ల డాన్స్ లతో కంటిన్యూ అవుతుంది అని తెలుస్తుంది. కానీ ఆ విషయాన్ని ఈ లిరికల్ సాంగ్లో రివీల్ చేయలేదు.

అలా చేయకపోవడం వల్ల ఈ పాట (Kurchi Madathapetti) గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. పాట బాగా వైరల్ అవుతుంది. సీనియర్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ చేయించడం త్రివిక్రమ్ కి కొత్తేమీ కాదు. గతంలో ‘అత్తారింటికి దారేది’ లో పబ్ సాంగ్ కోసం ‘ఖుషి’ ఫేమ్ ముంతాజ్ ని తీసుకొచ్చాడు, అలాగే ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ లో స్నేహతో చిందులేయించాడు. ఇప్పుడు ‘గుంటూరు కారం’లో ‘కుర్చీ మడతపెట్టి’ పాట కోసం పూర్ణని తీసుకొచ్చాడు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus