నందమూరి తారకరత్న మరణంతో నందమూరి – నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న.. ఫిబ్రవరి 18న కన్నుమూశారు.. కోలుకుని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు.. వారి ప్రార్థనలు ఫలించలేదు.. 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు..
తారకరత్న శివరాత్రి నాడు శివైక్యం అయ్యారు.. ఈవార్తతో చిత్ర పరిశ్రమ వారంతా షాక్ అయ్యారు.. ప్రధాని మోడీ మొదలు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారంతా సంతాపం వ్యక్తం చేస్తూ.. నివాళులర్పిస్తున్నారు. బాబాయ్ బాలయ్య బాధ వర్ణనాతీతం.. బాలయ్యను చూడగానే తారక రత్న పెద్ద కుమార్తె నిషిక పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకోవడం అందర్నీ కలచివేసింది.. అబ్బాయి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య.. తారక రత్నను అలా చూసి కంటతడి పెట్టారు..
తారక రత్న కుటుంబం తమ కుటుంబంలో భాగమని.. తారక్ భార్య అలేఖ్య రెడ్డి, ముగ్గురు పిల్లల బాధ్యత తాను చూసుకుంటానని మాటిచ్చారు.. బాలయ్యకి తారక రత్న కుటుంబం రుణపడి ఉంటుందని విజయ సాయి రెడ్డి చెప్పారు..ఇదిలా ఉంటే.. రెబల్ స్టార్ కృష్ణం రాజు తమ్ముడు, ప్రభాస్ నాన్న ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కూడా శివరాత్రి రోజునే శివైక్యం అయ్యారు.. 2010 ఫిబ్రవరి 12న వారు కాలం చేశారు.. నిర్మాతగా అన్నయ్య కృష్ణం రాజుతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారాయన..
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు కుమారుడు అకీరా తర్వాత కుమార్తె ఆద్య జన్మించిన సంగతి తెలిసిందే.. ఆద్య 2010లో శివరాత్రి నాడు పుట్టినట్టు సమాచారం.. ప్రభాస్ తండ్రి, తారక రత్న ఇద్దరూ కూడా శివరాత్రి రోజే శివైక్యం కావడం యాధృచ్చికం.. సోమవారం (ఫిబ్రవరి 20) సాయంత్రం మహాప్రస్థానంలో తారక రత్న అంత్యక్రియలు జరుగనున్నాయి..