ఆ హీరోతో కలిసి ప్లాన్ చేసిన డైరెక్టర్‌..అసలు ఏమి జరిగిందంటే..!

బాలీవుడ్‌‌ ఎవర్‌గ్రీన్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉండే పేరు ‘రేఖ’. ఆమె అందానికి అభిమానులే కాదు తోటి హీరోలు కూడా ఫిదా అయ్యేవారు. తన ఫ్యాషన్ సెన్స్‌తో ఈ జనరేషన్ హీరోయిన్లకు ఇప్పటికీ రోల్ మోడల్‌గా నిలుస్తుంటుంది రేఖ. ఇక తన ప్రేమ వ్యవహారాలు, రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్ విషయాలు కూడా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేవి. ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభంలో కొన్ని బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొంది. అలాంటి ఓ సంఘటనే ‘రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో ప్రచురించిన తన జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొంది.

బెంగాలీ యాక్టర్ బిస్వజీత్ ఛటర్జీ ‘అంజనా సఫర్‌’ చిత్ర షూటింగ్‌లో తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం ప్రస్తావించబడింది. కుల్జీత్ పాల్ దర్శకత్వం వహించిన ‘అంజనా సఫర్’ చిత్రం 1969లో విడుదలైంది. అప్పుడు రేఖకు వయసు కేవలం 15 ఏళ్లు కాగా.. ఛటర్జీ వయసు 33 ఏళ్లు. అయితే, ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఆమె సమ్మతి, సమాచారం లేకుండానే సదరు నటుడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ విషయం గురించి దర్శకుడికి కూడా ముందే తెలుసట.

ముంబైలోని మహబూబ్ స్టూడియోలో జరుగుతుండగా.. రొమాంటిక్ సీన్ చిత్రీకరణకు సంబంధించి డైరెక్టర్ కుల్జీత్ పాల్, నటుడు బిస్వజీత్ ముందుగానే ప్లాన్ చేసి ఈ చర్యకు పూనుకున్నారు. దీనికి రేఖ బాధితురాలైంది. ఈ సీన్ దాదాపు ఐదు నిమిషాల పాటు చిత్రీకరించగా.. అప్పటికి చాలా చిన్న ఏజ్‌లో ఉన్న రేఖ భయంతో వణికిపోయినట్లు పుస్తకంలో పేర్కొంది. దర్శకుడు యాక్షన్‌ చెప్పగానే నటుడు బిశ్వజీత్.. రేఖను తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదాలపై గట్టిగా కిస్ చేశాడు.

దీంతో ఈ సడెన్ ఇన్సిడెంట్‌కు రేఖ ఆశ్చర్యపోయింది. ఓ వైపు కెమెరా రోల్ అవుతూనే ఉండగా.. దర్శకుడు కట్ చెప్పకపోవడంతో బిశ్వజీత్ ఆమెను ముద్దాడుతూనే ఉన్నాడు. ఇలా ఐదు నిమిషాల పాటు కొనసాగింది. ఇదిలా ఉంటే ఈ సీన్‌కు యూనిట్ సభ్యులంతా ఈలలు వేస్తూ సందడి చేశారు. అప్పుడు రేఖ చేసేదేం లేక కళ్లు మూసుకుంది. కానీ అవి కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ ఇన్సిడెంట్ గురించి తన ఆత్మకథ పుస్తకంలో ప్రస్తావించింది రేఖ అయితే, సినిమాలో ఆ ముద్దు సీన్ చాలా కీలకమనేది దర్శకుడి ఆలోచనే తప్ప తనది కాదని నటుడు బిశ్వజీత్ పేర్కొనడం కొసమెరుపు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus