బ్రీఫ్ కేస్ తో మాస్ రాజా టెమ్టింగ్..ఫినాలేలో సెలబ్రిటీల రచ్చ..! సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అమెనే.!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం అయిపోయింది. డిసెంబర్ 18న సాయంత్రం 6గంటలకి హౌస్ మేట్స్ తో కలిసి కింగ్ నాగార్జున హల్ చల్ చేయబోతున్నాడు. ఈ షోలో సెలబ్రిటీల డ్యాన్స్ లు, సాంగ్స్ తో స్టేజ్ దద్దరిల్లిపోయింది. అంతేకాదు, హౌస్ లో నుంచీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్లు కూడా స్టేజ్ పైన తమ డ్యాన్స్ పెర్ఫామన్స్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా అభినయశ్రీ డ్యాన్స్ ఎట్రాక్షన్ గా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో మాస్ రాజా రవితేజ బిగ్ బాస్ స్టేజ్ పైన రెచ్చిపోయాడు. తనదైన స్టైల్లో పంచ్ లు వేస్తూ రెచ్చిపోయాడు.

శ్రీహాన్ నీకంట్ పెద్ద ఫ్లట్ మాస్టర్ అంటూ నాగార్జున చెప్తుంటే, మీరు ఏం తక్కువ సార్ అంటూ రవితేజ కౌంటర్స్ వేశాడు. అంతేకాదు, తన కెరియర్ లో ఫస్ట్ చెక్ ఇచ్చింది కింగ్ నాగార్జునే అంటూ చెప్పాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి సిల్వర్ బ్రీఫ్ కేస్ తీస్కుని వెళ్లి హౌస్ మేట్స్ ని టెమ్ట్ చేశాడు. ఆఫర్ తీస్కుని నాతో వచ్చేయమని చెప్పాడు. అంతేకాదు, తర్వాత హీరో నిఖిల్ హౌస్ లోకి వెళ్లి విన్నర్ ఎవరో చెప్తూ కాసేపు హౌస్ మేట్స్ తో ఆడుకున్నాడు. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైకి అలనాటి అందాల నటి రాధ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

 

ప్రస్తుతం బిబి జోడీ అనే డ్యాన్స్ షోకి జడ్జిగా రాబోతున్న రాధ బిగ్ బాస్ స్టేజ్ పైన కనిపించడంతో ఆడియన్స్ కి ఫుల్ కిక్ వచ్చింది. అంతేకాదు, బాలాదిత్య మీకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ రాధతో కలిసి డ్యాన్స్ చేశాడు. బిగ్ బాస్ ఫినాలేలో స్టేజ్ పైన సెలబ్రిటీల రాకతో షోకి ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ వచ్చింది.

మరోవైపు రేవంత్ ఇంకా శ్రీహాన్ ఇద్దరి మద్యలోనే గట్టి పోటీ ఉందని, వీరిద్దరిలో రేవంత్ విన్నర్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 విన్నర్ గా రేవంత్ నిలిచాడు. అదీ మేటర్..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags