Bigg Boss 7 Telugu: 3వ వారం ఎలిమినేషన్ లో జరిగింది ఏంటి ? థామిని వెళ్లిపోతూ ఏం చెప్పిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 3వ వారం అనూహ్యంగా థామినీ ఎలిమినేట్ అయ్యింది. మూడో కంటెస్టెంగా వచ్చి మూడోవారమే వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడమే థామిని ఓటమికి కారణం.. అంతేకాదు, టాస్క్ లలో కూడా పెద్దగా ఇన్వాల్ అవ్వలేదు. థామిని వెళ్లిపోతుంటే ప్రియాంక కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. గత కొన్ని రోజులుగా మా ఇద్దరి మద్యలో స్పెషల్ బాండింగ్ ఉందని అందుకే, ఎమోషనల్ అవుతున్నానని చెప్పింది. ఇక స్టేజ్ పైకి వచ్చిన థామిని ఒక్కో హౌస్ మేట్ కి ఒక్కో సలహాని ఇచ్చింది. ఇక్కడే శివాజీ గురించి చెప్తూ ఆయన కొందరికీ మాత్రమే ఫెవరెట్ గా ఉంటున్నాడని , హౌస్ లో కొంతమందిని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పింది.

అది వదిలేస్తే బెస్ట్ అనే సలహా ఇచ్చింది. కానీ, శివాజీ అదేం లేదని కొట్టిపారేశాడు. దీంతో ఆయన దీన్ని ఒప్పుకోడు అని మాట్లాడింది. దీనికి శివాజీ నువ్వు ఎలిమినేట్ అయిపోయావ్ కదా, ఇంటికెళ్లి ఎపిసోడ్స్ అన్నీ చూడు, నాది తప్పు అయితే నేనే సారి చెప్తా బయటకి వచ్చి అంటూ మాట్లాడాడు. దీంతో ఇద్దరి మద్యలో కాసేపు వాదన జరిగింది. నా జెర్నీ ఎ.విలో ఇప్పుడే చూశాను శివాజీగారు, నేను సేఫ్ గేమ్ ఆడలేదు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పింది.

దీనికి నేను సేఫ్ గేమ్ అని అని ఉండకపోవచ్చు, నీ గేమ్ నువ్వు ఆడలేదని మాత్రం చెప్పా, నువ్వు నీ గేమ్ ఆడలేదమ్మా అంటూ చెప్పాడు. నీ గేమ్ నువ్వు ఆడలేదని ఇంటికెళ్లి తీరిగ్గా ఎపిసోడ్స్ చూస్కోమని సలహా ఇచ్చాడు. ఎపిసోడ్స్ అన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడింది తప్పు అయితే ఖచ్చితంగా సారీ చెప్తాను తల్లీ.. అంటూ బుజ్జగించి మరీ పంపాడు. ఇద్దరి మద్యలో కొద్దిగా కోల్డ్ వార్ లా నడించింది. దీంతో నాగార్జున బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 పై తను రాసిన పాటని పాడి హౌస్ మేట్స్ లో జోష్ ని నింపింది.

ఏది ఏమైనా థామిని ఎలిమినేషన్ అనేది కొంతమంది హౌస్ మేట్స్ ని బాధించింది. వాళ్లు శుభశ్రీ వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ, హౌస్ లో శివాజీ సపోర్టింగ్ గా ఉంటోంది కాబట్టి శివాజీ నామినేషన్స్ లో లేడు కాబట్టి శుభశ్రీ సేఫ్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేక థామిని ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. వీరిద్దరి మద్యలోనే లాస్ట్ వరకూ పోటీ ఉంది. వీరిద్దరే ఎలిమినేషన్ డేంజర్ లో ఉన్నారు. ఇక థామిని వెళ్లిపోతూ అందరికీ సలహాలు ఇఛ్చింది. ఎవరి గేమ్ ఎలా మార్చుకోవాలో క్లియర్ గా చెప్పింది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus