కాజల్ కాస్ట్యూమ్ కోసం 20 మంది పనిచేశారట!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటిపోయినా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. అటు తమిళంలో, ఇటు తెలుగులో క్రేజ్ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె ఉన్నట్లుండి పెళ్లి చేసుకుంది. తన పెళ్లి గురించి గత నెలలో ప్రకటించిన ఈ బ్యూటీ నెలాఖరున తను ప్రేమించిన గౌతమ్ ను పెళ్లి చేసుకుంది. కరోనా టైమ్ కావడంతో తక్కువ మంది అతిథుల సమక్షంలో కాజల్ వివాహం జరిగింది. అయితే వధూవరులను ముస్తాబు చేయడంలో ఎక్కడా రాజీ పడలేదు.

వారి స్థాయికి తగ్గట్లుగానే భారీగా ఖర్చు చేసి సెప్ష గా డిజైన్ చేసిన వస్త్రాలను ధరించారు. కాజల్ ధరించిన రెడ్ కలర్ లెహంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లెహంగా డిజైనింగ్ గురించి కొందరు అమ్మాయిలు సోషల్ మీడియాలో కాజల్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక చాలా కథ ఉందట. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ఈ డిజైనర్ లెహంగా గురించి ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో ఇష్టంగా ఈ లెహంగాను తయారు చేశామని.. ఫ్లోరల్ డిజైన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించడానికి 20 మంది దాదాపు నెల రోజుల పాటు కష్టపడ్డారని.. ఆమె వెల్లడించింది.

అంటే కాజల్ పెళ్లి విషయం అనౌన్స్ చేయకముందే లెహంగా డిజైనింగ్ మొదలైంది. దీనికోసం లక్షల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలానే ఈ డ్రెస్ తో పాటు ధరించిన నగలు కూడా బాగా ఖరీదైనవని సమాచారం. ఈ ఆభరణాలను సునీతా షెకావత్ అనే డిజైనర్ స్వయంగా చేతితో తయారు చేశారట. ముంబైలో తాజ్ హోటల్ లో కాజల్, గౌతమ్ ల పెళ్లి ఘనంగా జరిగింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus