ఆర్ఆర్ఆర్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కొమురం భీముడో సాంగ్ కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ హావభావాలు సాధారణ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేలా ఉన్నాయి. ప్రముఖ పాటల రచయితలలో ఒకరైన సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు. తాజాగా ఒక సందర్భంలో సుద్దాల అశోక్ తేజ ఈ పాట గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సరాల పాటు తాను ఈ పాటను దాచిపెట్టానని ఆయన తెలిపారు.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో ఒక పాటైనా రాసే ఛాన్స్ దక్కుతుందని తాను అనుకున్నానని తాను ఊహించిన విధంగా కీరవాణి భార్య వల్లి ఫోన్ చేశారని సుద్దాల అశోక్ తేజ అన్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్న ఆఫీస్ లో రాజమౌళి కొమురం భీమ్ పాత్ర గురించి తనకు చెప్పారని సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. కొమురం భీమ్ నినాదమైన జల్ జంగల్ జమీన్ గురించి తనకు అవగాహన ఉందని పరమవీరచక్ర మూవీలో కొమురం భీమ్ గురించి తాను ఒక పాటను రాశానని ఆయన తెలిపారు.
తల తెగినా తలవంచనని నా జీవితంలో మోకరిల్లడం జరగదనేలా భీమ్ పాత్రను చూపిస్తున్నామని రాజమౌళి చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. ట్యూన్ లేకుండానే ఈ పాట రాశానని ఎన్టీఆర్ పాడినట్టు పాట ఉంటే బాగుంటుందని తాను రాజమౌళికి చెప్పానని 45 నిమిషాల్లో ఈ పాట రాశానని సుద్దాల అశోక్ తేజ అన్నారు. రెండున్నరేళ్ల పాటు భార్యకు కూడా ఈ పాటను వినిపించలేదని సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. గతంలో ఏ పాటకు రాని స్థాయిలో ఈ పాటకు స్పందన దక్కిందని బాలు గారు జీవించి ఉంటే ఈ పాట ఆయనే పాడేవారని సుద్దాల తెలిపారు.
కాలభైరవ ఆ లోటును తీర్చారని పాటను అద్బుతంగా పాడారని సుద్దాల పేర్కొన్నారు. కొమురం భీముడో పాట డబుల్ ఆర్ అని కాలభైరవ గొంతులోని రా నెస్ తెలంగాణ పలుకుబడిలోని రా నెస్ కలిసి డబుల్ ఆర్ అయిందని ఆయన తెలిపారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!