KGF: కేజీఎఫ్ కథ రాసింది ఒక్కరు కాదు.. అనంత్ పాత్ర కూడా ఉంది!

కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా ఆకాశానికి తీసుకువెళ్లిన ఏకైక సినిమా కేజిఎఫ్ చాప్టర్ 1. ఇక ఆ సినిమా కథకు కొనసాగింపుగా వస్తున్నా KGF 2 పై అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తుందని క్లారిటీ వచ్చేసింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం విశేషం. అయితే ఈ సినిమాలో ఫస్ట్ చాప్టర్ లో అనంత్ నాగ్ సీనియర్ నటుడు జర్నలిస్ట్ ఆనంద్ వాసిరాజ్ క్యారెక్టర్ సినిమా కథను చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Click Here To Watch NOW

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో ఆయన క్యారెక్టర్ కనిపించక కనిపించడం కొంత ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో అయితే అనంత్ కు ఈ సినిమా దర్శకుడి తో విభేదాలు వచ్చి సినిమా నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు విడుదలైన చాప్టర్ 2 ట్రైలర్ లో ఆయన కాకుండా ప్రకాష్ రాజ్ చేత కథను చెప్పించడంతో అది నిజమని అనుకున్నారు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనంత్ నాగ్ కూడా ఉంటాడు అని తెలుస్తోంది.

ఒక విధంగా ట్రైలర్ ఒక డైలాగ్ ను గమనిస్తే ఆ విషయం కూడా క్లారిటీగా అర్థం అవుతోంది. ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్ళాం’ అని ప్రకాష్ సార్ చెప్పిన విధానంతో ఈ పుస్తకాన్ని ఇద్దరు రాసినట్లు అర్థమవుతోంది. మొదటి పుస్తకాన్ని అనంథ్ క్యారెక్టర్ తో కొనసాగించగా ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చి మరొక భాగాన్ని పూర్తి చేసి ఉండవచ్చు అని తెలుస్తోంది.

మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ కేవలం కన్నడ భాషల్లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సరికొత్త సంచలనాలు క్రియేట్ చేసింది. ఎక్కువగా హిందీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు అర్థమైంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus