స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, భూమిక ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించగా ఎస్ జె సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన విడుదలైన ఈ సినిమా కలెక్షన్లపరంగా రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎస్ జె సూర్య ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.
ఖుషి సినిమా రిలీజై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సూర్య పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను, ఇతర విషయాలను వెల్లడించారు. ఖుషి సినిమాను పవన్ కళ్యాణ్ తోనే మొదట తెరకెక్కించాలని అనుకున్నానని పవన్ అప్పటికే వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల తమిళంలో విజయ్ హీరోగా ఖుషి సినిమా మొదట తెరకెక్కిందని సూర్య అన్నారు. నటుడు కావాలని అనుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని సూర్య పేర్కొన్నారు.
సినిమాలలోకి రాకముందు తాను హోటల్ లో సర్వర్ గా కప్పులు కడిగేవాడినని సూర్య తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపారు. ఎంతో కష్టపడ్డాను కాబట్టే దర్శకుడిగా మాత్రమే కాక నటుడిగా కూడా తనకు గుర్తింపు వస్తోందని సూర్య అన్నారు. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం గురించి స్పందిస్తూ అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడం వల్లే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని సూర్య చెప్పుకొచ్చారు.
విలన్ రోల్స్ లో నటించడం తనకు అస్సలు ఇష్టం ఉండదని అందువల్లే తాను ఆ పాత్రలకు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నానని సూర్య వెల్లడించారు. దర్శకుడిగా గుర్తింపు ఉన్నా అన్ని భాషల్లో హీరోగా పేరు తెచ్చుకోవడమే తన కోరిక అని సూర్య తెలిపారు.