గుడిలో సమంత ఉన్న సీన్ తో సినిమా మొదలుతుంది. మధురం మధురం సాంగ్ తో మహేష్ బాబు ఎంట్రీ ఇస్తాడు. చాలా అందంగా కనిపిస్తాడు. “వచ్చింది కదా అవకాశం” పాటలో మహేష్ తో కలిసి ప్రణీత, నరేష్, షాయాజీ షిండే అందరూ డాన్సు చేస్తారు.
మహేష్ ఫ్యామిలీ పెయింట్ కంపేనీని నడిపిస్తున్న్తారు. తండ్రి సత్యరాజ్, తల్లి రేవతి. సత్యరాజ్ కి నలుగురు చెల్లెళ్ళు. వారిలో ఒకరి భర్త రావు రమేష్. సత్యరాజ్ అందరిని ఉమ్మడి కుటుంబంగా ఉంచాడు. ఈ ఆస్ట్రేలియా కు వెళ్ళిపోయే ముందు విలేజ్ లో మూడు రోజులు ఉండేందుకు కాజల్ మహేష్ ఇంటికి వస్తుంది.
మహేష్ కాజల్ ని మొదటి చూపులోనే ఇష్ట పడుతాడు. ఆమెని ఇంప్రెస్ చేస్తాడు. బాల త్రిపురమని అంటూ పాట. రావు రమేష్ కూతురు ప్రణీత మహేష్ ని ప్రేమిస్తుంది. బావని ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. వీరిద్దరి మధ్య మాటలు చాలా బాగుంటుంది. కాజల్, మహేష్ అప్పటికే చాలా దగ్గరవుతారు.
“నాయిడొరి ఇంటికాడ పాట వస్తుంది. ఇప్పటి వరకు సినిమా విజయవాడలో సాగుతుంది. పాట అయిపోయిన వెంటనే ఫ్యామిలీ మొత్తం టూర్ కి వెళుతారు. అక్కడ “ఈ క్షణం నిజమైతే” పాట ఉంటుంది.
కాజల్ కి ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టముండదు. పెళ్లి చేసుకుని వేరేగా ఉందామని చెబుతుంది. అందుకు మహేష్ ఒప్పుకోడు. ఇద్దరు విడిపోతారు. మహేష్ కి కాజల్ కి లవ్ ఉందని తెలుసుకున్న రావు రమేష్ కోపం తో సత్య రాజ్ ని తిడుతాడు. అప్పుడు సత్యరాజ్ కొడుకు మహేష్ బాబుకి కుటుంబ విలువల గురించి చెబుతాడు. ఈ సమయంలో తన తుది శ్వాసను విడుస్తూ కుటుంబాని విడదీయ కూడదని మహేష్ తో ప్రమాణం తీసుకుంటాడు. ఇక్కడే విశ్రాంతి.
సమంత మహేష్ చెల్లిలితో కలిసి ఇంటికి వస్తుంది. ఆమె ఆలోచనలు సత్య రాజ్ ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబం లో బతకాలని చెబుతుంటుంది. మహేష్ పూర్వీకులను వెతకడానికి మహేష్ తో పాటు సమంత కూడా బయలు దేరుతుంది. వారి ప్రయాణాన్ని బ్రహ్మోత్సవం పాట ద్వారా చూపించాడు. ఇలా ప్రయాణిస్తూ హరిద్వారకు చేరుకుంటారు. వీరికి తోడుగా వెన్నెల కిషోర్ ఉంటాదు. హరిద్వార నుంచి బెంగళూర్ కి వస్తారు . అక్కడ పబ్ లో “పుట్ యువర్ హాండ్స్ అప్” సాంగ్ ఉంటుంది.
రావు రమేష్ తన కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ పనుల్లో ఉండగా అక్కడికి మహేష్, తన తల్లి తో కలిసి వెళుతాడు. ఆ వేడుకలో రావు రమేష్ మహేష్ ని, చనిపోయిన సత్యరాజ్ ని అవమానిస్తాడు. అప్పుడు మహేష్ తన తండ్రి రావు రమేష్ కి ఏమి చేసాడో వివరిస్తాడు. మహేష్ చెప్పిన విషయాలకు రావు రమేష్ బాధపడుతాడు. ఇక్కడ సీన్లు అందరిని కంట తడి పెట్టిస్తాయి.
మహేష్ చెప్పిన నిజాలు ఏంటి, దర్శకుడు ఎలా శుభం కార్డ్ వేసాడో తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్ళాలి.