తెలుగు ప్రజలతో పాటు దేశం మొత్తం గర్వించదగ్గ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం. ఏ భాషలో పాడిన ఆయన గళానికి “వందనం అభి వందనం” పలికారు. ఆయన తెలుగోడి కీర్తి “ఆకాశం తాకేలా” ఆలపించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా నిగర్విగా ఉండే గాన గంధర్వుడి జన్మదినం నేడు(4 జూన్ ). ఈ సందర్భంగా భారత స్వర శిఖరం గురించి కొన్ని ఆసక్తికర సంగతులు..బాలు స్వస్థలం నెల్లూర్ లోని మూల పేట. కానీ అతన్నీ అందరూ మద్రాసీ అని పిలుస్తుంటారు.శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న(1966) సినిమాతో గాయకుడిగా ఆరంగేట్రం చేసిన బాలు.. ఇప్పటి వరకు 15 భాషల్లో 40 వేలు పైగా పాటలు పాడారు. ఆయన ఇప్పటివరకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోక పోవడం విశేషం.ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు బాలు 21 కన్నడ పాటలు పాడారు. అంటే రికార్డ్ చేసారు. ఒకే రోజులో ఇన్ని పాటలు పాడిన గాయకుడు ఎవరూ లేరు. తమిళం లోనూ ఒక రోజులో 19 తమిళం పాటలను పాడి (రికార్డ్) బాలు రికార్డ్ సృష్టించారు.బాలు స్వరాల సృష్టి కర్త కూడా. నాలుగు భాషల్లో 46 చిత్రాలకు సంగీతం అందించారు.బాలు 70 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఇందులో కమలహాసన్, రజనీ కాంత్ వంటి హీరోల సినిమాలున్నాయి.ఈటీవీలో పాడుతా తీయగా షోకు జడ్జిగా వ్యవహరించారు. ఈ షో పాతికేళ్లుగా విజయవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు 11 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా చిత్ర పరిశ్రమకు అనేక మంది గాయకులు పరిచయమయ్యారు.కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండడం వల్ల తన కుటుంబం, పిల్లల విషయంలో సరిగా శ్రద్ధ పెట్టలేక పోయానని పలు సందర్భాల్లో బాలు చెప్పారు.వేదికల పై పాటలు పాడే ఆయన ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడూ పాడలేదు .ఐస్ వాటర్, పెరుగన్నం, ఐస్ క్రీం. గాయకులూ ఈ మూడింటికి దూరంగా ఉండాలి. బాలు మాత్రం ఇవి లేకుండా ఉండలేరు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బాలు ఎన్నోఅవార్డులను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ తో గౌరవించింది.