మల్టీస్టారర్ మూవీస్‌తో తెరమీద ఒక టికెట్టుకి రెండు సినిమాలు అన్నట్టు.. తమ ఇద్దరు కథానాయకులను చూసి తెగ సంబర పడిపోయేవారు ప్రేక్షకాభిమానులు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో క్రేజీ కాంబినేషన్లలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఆ తర్వాత హీరోలను కలిసి చూసే సందర్భం రావడమనేది సినిమా ఫంక్షన్లలోనే.. అలా తమిళ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న ఓ చిత్ర ప్రారంభానికి రావడం అనేది అప్పట్లో సంచలనంగా మారి..
ఇప్పుటికీ మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది..ఇంతకీ ఏంటా సినిమా?.. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.. మోహన్ బాబు హీరోగా, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో, శ్రీ సాయిశాంతి ఫిలింస్ బ్యానర్ మీద పి. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి దగ్గర్లోని దుర్గసముద్రంలో ఏర్పాటు చేశారు. శివాజీ గణేశన్, ఆయన తనయులు రామ్ కుమార్, హీరో ప్రభులతో పాటు చిరంజీవి, అప్పటి లోక్‌సభ సభ్యుడు మాగుంట సుబ్బరామి రెడ్డి వంటి అతిరథమహారథుల మధ్య ఈ వేడుక అంగరంగవైభవంగా జరిగింది.
ఇది మోహన్ బాబు హీరోగా, కోదండరామి రెడ్డి డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం (అంతకుముందు ఆయన దర్శకత్వంలో విలన్‌గా చేశారు).. అలాగే ‘అసెంబ్లీరౌడీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దివ్య భారతితో మరోసారి.. ‘బ్రహ్మ’ మూవీలో పూజా బేడీతో యాక్ట్ చేయాలని అనుకున్న మోహన్ బాబు కోరిక ఈ సినిమాతో నెరవేరింది.. మోహన్ బాబు మీద చిరు క్లాప్ నివ్వగా.. శివాజీ గణేశన్ కెమెరా స్విచ్చాన్, ఆయన రెండో కుమారుడు, నటుడు ప్రభు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
తనను తమిళ చిత్రసీమకి పరిచయం చేసిన ఆప్తమిత్రులు శివాజీ గణేశన్ గారి మీద గౌరవంతో తనయులతో సహా ఆహ్వానించగా వారు విచ్చెయ్యడం.. మెగాస్టార్, నా స్నేహితుడు చిరంజీవిని కూడా మర్యాదపూర్వకంగా పిలిచానని.. నిర్మాత శ్రీధర్ రెడ్డి తనకు 20 ఏళ్లుగా పరిచయం అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.. ఇంతకీ ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ సినిమా పేరేంటో తెలుసా?.. ‘చిట్టెమ్మ మొగుడు’.. ప్రేక్షకాదరణపొందిన ఈ చిత్రంలో K.V.మహదేవన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకుంటాయి.. ముఖ్యంగా ‘బొడ్డులో రూపాయి బిల్లా’ పాట ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది..
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?